
📌 Key Points
- చిరంజీవి లేటెస్ట్ మూవీలో మందు సీన్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే!
- ఆల్కహాల్ డైలాగ్ తో పిల్లలు రీల్స్ చేస్తున్నారని స్పందించిన అనిల్ రావిపూడి.
- పిల్లలు దయచేసి ఆ సీన్స్ చేయొద్దని అనిల్ రావిపూడి విజ్ఞప్తి!
- పెద్దలు మాత్రమే ఆ సీన్ ను ఎంటర్టైన్ చేయాలనీ కోరిన డైరెక్టర్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు సినిమా’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అయితే, ఈ సినిమాలోని ఒకానొక సన్నివేశంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
చిరంజీవి మందు సీన్స్ పై అనిల్ రావిపూడి రియాక్షన్!
Anil Ravipudi : ఇటీవల సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. గతంలో పలు సినిమాల్లో చిరంజీవి మందు తాగిన సీన్స్ చాలా సినిమాల్లో బాగా పేలాయి. ఈ సినిమాలో కూడా చిరంజీవి.. మధుపానం మహా ఆనందం మనో ధైర్యం ధనాధన్ అనే ఓ డైలాగ్ చెప్తూ మందు తాగడంతో ఇది బాగా వైరల్ అయింది.(Anil Ravipudi)
సోషల్ మీడియాలో కూడా ఈ డైలాగ్ బాగా వైరల్ అయింది. ఈ డైలాగ్ తో అందరూ రీల్స్ కూడా చేస్తున్నారు. రియల్ గా మందు తాగేవాళ్ళు కూడా దీన్ని స్లోగన్ గా తీసుకుంటున్నారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసిందే. అందుకే సినిమాల్లో కూడా మొదట్లోనే ఆల్కహాల్ ఆరోగ్యానికి ప్రమాదకరం అని నోట్ వేస్తారు. మందు సీన్స్ ఉన్నప్పుడు కూడా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని సినిమా కింద నోట్ వేస్తారు.
పిల్లలు రీల్స్ చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్!
తాజాగా అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు కూడా ఈ ఆల్కహాల్ డైలాగ్ తో రీల్స్ చేస్తున్నారని తెలిసి దీనిపై స్పందించారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి పాత సినిమాల్లో నుంచి ఆ ఆలోచన వచ్చింది. మందు తాగిన సీన్స్ లో ఆయన మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఇందులో ఎక్కువగా రుద్దలేదు. అక్కడక్కడా వెంకటేష్ సీన్ కోసం లీడింగ్ లాగా తీసుకున్నాం. కానీ ఆ సీన్ బాగా వైరల్ అయింది. మందు తాగేవాళ్ళు, లేడీస్, కొంతమంది జనాలు సరదాగా రీల్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది టీ, థమ్స్ అప్ లతో కూడా చేస్తున్నారు సరదాగా. అది తప్పులేదు.
మాస్ ఆడియన్స్ కోసమే ఆ సీన్.. క్లారిటీ ఇచ్చిన అనిల్!
కానీ ఒక విషయం చెప్పాలి. పిల్లలు మాత్రం దయచేసి ఇది చేయొద్దు అని చెప్తున్నా. పిల్లలు దీనికి దూరంగా ఉండండి. పిల్లలను ఈ విషయంలో ఎంటర్టైన్ చేయొద్దు. మంచిది కాదు. పిల్లలను ఇది చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆ సీన్ మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. పెద్దలు వాళ్లకు తగ్గట్టు మార్చి కొత్తగా చేస్తున్నారు. మందు తాగేవాళ్లకు ఇది ఒక స్లోగన్ అయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయండి అని అన్నారు.
అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారి సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


