|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి సంచలనం: నాగార్జునతో సినిమా.. టాలీవుడ్ రికార్డు బ్రేక్!

Updated: 11-01-2026, 10:05 AM
అనిల్ రావిపూడి సంచలనం: నాగార్జునతో సినిమా.. టాలీవుడ్ రికార్డు బ్రేక్!
  • చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.
  • నాగార్జునతో సినిమా చేస్తే టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టిస్తా.
  • త్వరలోనే నాగార్జునతో సినిమా ప్రకటన ఉంటుందని వెల్లడి.
  • గతంలో నాగార్జునతో ‘హలో బ్రదర్’ లాంటి సినిమా చేయాలనీ ఉంది.

టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సంచలనానికి తెరలేపారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తరువాత, నాగార్జునతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

నాగార్జునతో సినిమా ఎప్పుడు? అనిల్ సమాధానం!

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. చాలాకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సినిమా చేయడం. వింటేజ్ లుక్స్ లో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. అయితే, కెరీర్ ముందు నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) సీనియర్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆయన వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఇక బాలకృష్ణతో భగవంత్ కేసరి లాంటి సోషల్ సినిమా చేసాడు జాతీయ అవార్డు అందుకున్నాడు.

హలో బ్రదర్ తరహా సినిమా ప్లానింగ్ లో అనిల్!

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. అయితే, సీనియర్ హీరోలలో ఆయన కేవలం నాగార్జునతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా ఇదే విషయం గురించి అనిల్ దగ్గర ప్రస్తావించగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ దర్శకుడు. ‘టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో సినిమాలు చేశాను.

టాలీవుడ్ రికార్డుపై అనిల్ రావిపూడి గురి!

మరి నాగార్జునతో సినిమా ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. ఆయనతో ఒక సినిమా చేయాలని నాకూ కూడా ఉంది. చేస్తే ఈతరంలో నలుగురు అగ్ర హీరోలతో సినిమాలు ఫస్ట్ డైరెక్టర్ గా రికార్డ్‌ నాదే అవుతుంది. అయితే, మన శంకరవరప్రసాద్ గారు సినిమా తరువాత ఏ సినిమా చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. త్వరలోనే కొత్త సినిమాను ప్రకటిస్తాను”అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇక గతంలో కూడా నాగార్జునతో హలోబ్రదర్ లాంటి సినిమా చేయాలని ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. మరి అయన కోసం ఇప్పుడు ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు అనేది చూడాలి.

అనిల్ రావిపూడి, నాగార్జున కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.