
ప్రవీణ్ హీరోగా నటిస్తున్న ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Key Points
ప్రవీణ్ హీరోగా నటిస్తున్న 'బకాసుర రెస్టారెంట్' చిత్రం టైటిల్ సాంగ్ విడుదల.
అనిల్ రావిపూడి చిత్ర టైటిల్ సాంగ్ ను విడుదల చేసి ప్రశంసించారు.
హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, గరుడరామ్ తదితరులు నటిస్తున్నారు.
బకాసుర రెస్టారెంట్ టైటిల్ సాంగ్ విడుదల
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant). ఈ చిత్రంలో వైవా హర్ష (Viva Harsha) టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ తదితరలు ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం నుంచి తాజాగా బకాసుర టైటిల్ ర్యాప్ సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
అనిల్ రావిపూడి ప్రశంసలు
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బకాసుర రెస్టారెంట్ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ప్రవీణ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకురావాలి’ అన్నారు.
చిత్ర విడుదల తేదీ త్వరలో
దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం. అనిల్ రావిపూడి మా సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా చిత్రం అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
చిత్రయూనిట్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రశంసలతో చిత్రంపై అంచనాలు పెరిగాయి.


