|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు మూవీ విధ్వంసం! మూడు రోజుల్లోనే పాన్ ఇండియా రికార్డులు బద్దలు!

Published: 15-01-2026, 1:30 AM
చిరు మూవీ విధ్వంసం! మూడు రోజుల్లోనే పాన్ ఇండియా రికార్డులు బద్దలు!
  • చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదలైంది.
  • ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 13 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
  • ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీకి మిక్స్డ్ టాక్ రావడం చిరంజీవి సినిమాకు కలిసొచ్చింది.
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే పాన్ ఇండియా సినిమాలకు షాక్ ఇస్తూ రికార్డులు సృష్టిస్తోంది.

మూడు రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు

MSGV Movie : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. గతంలో విడుదలైన సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్లను వసూలు చేస్తుంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ రోజురోజుకీ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సంక్రాంతికి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువమంది ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో టికెట్ల బుకింగ్ కూడా పెరుగుతుందని తెలుస్తుంది. అయితే మూడు రోజుల్లోనే పాన్ ఇండియా సినిమాలకు షాక్ ఇచ్చేలా ఈ సినిమాకు టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది.. మరి ఎన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయో ఒకసారి తెలుసుకుందాం..

టాలీవుడ్ కామెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రోజురోజుకీ కలెక్షన్లను పెంచుకుంటూ దూసుకుపోతుంది.. నిన్న రిలీజ్ అయిన కొత్త సినిమాలు కూడా ఈ సినిమాని ఢీకొట్టలేకపోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం మూడు రోజులని బుకింగ్స్ లో రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడంతో ఈ మూవీకి బాగా కలిసివచ్చింది. ఆ తర్వాత విడుదలైన నాలుగు సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, అయినప్పటికీ కూడా జనాలకు చిరంజీవి సినిమానే మొదటి ఛాయస్ గా ఉండడాన్ని చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ అభిప్రాయం ఏంటో అర్థమవుతుంది.. ఇక మూడు రోజుల్లోనే బుక్ మై షో యాప్ స్టేటస్ ని చూసిన తరవాత ట్రేడ్ పండితులకు షాక్ తగిలింది. ఫస్ట్ డే 4. 80 లక్షల టికెట్స్ బుకింగ్స్, సెకండ్ డే 4 లక్షల 5 వేలు, మూడవ రోజున 4 లక్షల 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.. మొత్తానికి కేవలం మూడు రోజుల్లోనే 36 లక్షల టికెట్స్ అమ్ముడయ్యినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ సినిమాకు దక్కని రికార్డు చిరంజీవి సినిమాకు దక్కిందని మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

చిరంజీవి సినిమాకు కలిసొచ్చిన అంశాలు

ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న చిత్రం

అనిల్ రావిపూడి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పాలి.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. మొత్తం వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాకు రూ.140-150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ ప్రకారం చూస్తే.. సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 300 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయాల్సి ఉంటుంది. కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమా ప్రీమియర్ డే రోజునే సుమారు రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.. ఫస్ట్ డే రూ.32.25 కోట్లు, రెండో రోజు రూ.19.5 కోట్లు, మూడో రోజు రూ.38 నుంచి రూ.40 కోట్ల వరకు వసూల్ చేసిందని అంచనా.. ఇక నాలుగో రోజు కూడా సంక్రాంతి సందర్భంగా ఫ్రీ బుకింగ్స్ బాగానే జరిగినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే కేవలం ఈ వారం లోపలే ఈ సినిమా 300 కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.. మరి చివరికి ఇదే జోరుతో కొనసాగితే మాత్రం.. 1000కోట్లు రాబట్టే అవకాశం కూడా ఉందని సినిమా ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు..

మొత్తానికి చిరంజీవి సినిమా మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.