|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమ్మగా శ్రీదేవి సంచలనం! బ్యాండ్ మేళం నుండి ఊహించని వీడియో విడుదల!

Published: 17-02-2026, 7:05 AM
రాజమ్మగా శ్రీదేవి సంచలనం! బ్యాండ్ మేళం నుండి ఊహించని వీడియో విడుదల!
  • శ్రీదేవి, హర్ష రోషన్ జంటగా ‘బ్యాండ్ మేళం’ సినిమా మార్చి 13న విడుదల కానుంది.
  • ఈ సినిమాలో శ్రీదేవి ‘రాజమ్మ’ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు.
  • ‘కోర్టు’ సినిమాతో శ్రీదేవి, రోషన్ జోడీ మంచి విజయం సాధించింది.
  • ‘బ్యాండ్ మేళం’ సినిమా ద్వారా ఈ జంట మరో హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శ్రీదేవి, హర్ష రోషన్ జంటగా ‘బ్యాండ్ మేళం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీదేవి రాజమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

రాజమ్మగా శ్రీదేవి పాత్ర పరిచయం

Sridevi: శ్రీదేవి పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె హీరోయిన్ గా అవకాశాలు అందుకొని ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. శ్రీదేవి(Sridevi) నాని నిర్మాణంలో తెరకెక్కిన కోర్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తన నటనతో మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలు అలాగే తమిళ సినిమాలలో బిజీబిజీగా గడుపుతున్నారు. హర్ష రోషన్(Harsha Roshan) శ్రీదేవి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్ మంచి సక్సెస్ కావడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో బ్యాండ్ మేళం(Band Melam) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చి 13వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఇటీవల వాలెంటైజ్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా ఒక ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం మరొక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. హీరోయిన్ శ్రీదేవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఈమె రాజమ్మ(Rajamma) అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా రాజమ్మగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా శ్రీదేవి ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ విడుదల

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ ని పరిచయం చేశారు. రోషన్ శ్రీదేవి జంటగా కోర్టు సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. మరి ఈ జంట బ్యాండ్ మేళం సినిమా ద్వారా ఎలాంటి హిట్ కొట్టబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా వీరిద్దరికి తెలుగులో రెండో సినిమా కావటం విశేషం. ఇకపోతే కోర్టు సినిమా కూడా 2025 మార్చి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక బ్యాండ్ మేళం సినిమా కూడా అదే హిట్ సెంటిమెంట్ డే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో ఈ జోడి ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది వేచి చూడాలి. ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఈమె తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే .ప్రస్తుతం ఈమె తమిళంలో హైకూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుత షూటింగ్ పనులను జరుపుకుంటుంది . మరో వైపు రోషన్ కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

శ్రీదేవి, రోషన్ జోడీ హిట్ సెంటిమెంట్

‘బ్యాండ్ మేళం’ సినిమా మార్చి 13న విడుదల కానుంది. శ్రీదేవి, రోషన్ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా విజయం సాధిస్తుందా వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.