|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా టికెట్ల రేట్లు వర్సెస్ ఉల్లిపాయ ధరలు: అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు!

Published: 06-01-2026, 12:05 PM
సినిమా టికెట్ల రేట్లు వర్సెస్ ఉల్లిపాయ ధరలు: అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు!
  • నిర్మాత అనిల్ సుంకర సినిమా టికెట్ల ధరలను ఉల్లిపాయ ధరలతో పోల్చారు.
  • టికెట్ల రేట్లపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
  • శర్వానంద్ హీరోగా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
  • జనవరి 15న ఈ సినిమా విడుదల కానుండగా, 14న ప్రీమియర్లు ఉంటాయి.

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సినిమా టికెట్ల రేట్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టికెట్ల ధరలను ఉల్లిపాయల ధరలతో పోల్చుతూ ఆయన మాట్లాడిన తీరు వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి.

అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు ఏమిటి?

Anil Sunkara:  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సినిమా టికెట్లు ధర గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో విడుదలవుతున్న సినిమాలకు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వాలు కూడా అనుమతి తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది సినిమా టికెట్ల ధరలు పెంచడంతో పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది దర్శక నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచడం గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా నిర్మాత అనిల్  సుంకర (Anil Sunkara)సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ.. సాధారణంగా కొన్ని సీజన్ లో ఉల్లిపాయ ధరలు భారీగా పెరుగుతాయి. కాని పెరిగిన ధరల గురించి ఎవరు మాట్లాడరు వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడో ఒకసారి పెంచే సినిమా టికెట్ల రేట్ల గురించి పెద్ద ఎత్తున డిబేట్ లు పెట్టి మరి చర్చలు జరుపుతుంటారని అనిల్ సుంకర ఏకంగా సినిమా టికెట్ల ధరలకు ఉల్లిపాయ ధరలకు ముడి పెడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈయన ఏకే ఎటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు .ఇక త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి తెలిసిందే.

టికెట్ల ధరలు vs ఉల్లిపాయల ధరల పోలిక

ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari)అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ఆ సినిమాలకు పోటీ ఇస్తూ శర్వానంద్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.  జనవరి 15వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా జనవరి 15వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాకు జనవరి 14వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. సినిమా విడుదలకు కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు . ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా  ప్రమోషన్లలో భాగంగానే నిర్మాత అనిల్ సుంకర వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా టికెట్ల రేట్లు పెరగడం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా వివరాలు

సినిమా ప్రమోషన్లలో భాగంగా అనిల్ సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు టికెట్ల ధరలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ పోలికపై వివిధ వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చర్చ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.