|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కొత్త టాలెంట్స్‌కి అనిల్ సుంకర బంపర్ ఆఫర్! బెజవాడ బ్యాచ్ తో దుమ్ము రేపనున్నారు!

Published: 26-01-2026, 12:05 PM
షాకింగ్: కొత్త టాలెంట్స్‌కి అనిల్ సుంకర బంపర్ ఆఫర్! బెజవాడ బ్యాచ్ తో దుమ్ము రేపనున్నారు!
  • అనిల్ సుంకర భారీ ఆఫర్: కొత్త టాలెంట్స్‌కు ‘ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ మూవీలో అవకాశం!
  • విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో నిరుద్యోగుల కథ: సక్సెస్ కోసం నలుగురు యువకుల పోరాటం!
  • ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత అనిల్ సుంకర మరో సంచలనానికి శ్రీకారం!
  • అర్జున్‌కు గ్రాండ్ వెల్కమ్: యూఎస్‌లో సెటిల్ అయినా బెజవాడ బ్యాచ్ మాత్రం ఇక్కడే!

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర మరో సంచలనానికి తెరలేపారు. ‘ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే మూవీతో కొత్త టాలెంట్స్‌ను ప్రోత్సహించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించి అనేక విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యూత్ ఫుల్ స్టోరీతో అనిల్ సుంకర మూవీ!

నారీ నారీ నడుమ మురారి నిర్మాత అనిల్ సుంకర న్యూ టాలెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్ ప్రకటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పాత్రను వినూత్నంగా పరిచయం చేశారు.

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఆలోచనలతో సినిమాలు నిర్మించే నిర్మాతగా పేరొందిన అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ ఇప్పటికే సినీ వర్గాల్లోనే కాకుండా క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ మంచి స్పందన తెచ్చుకుంది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా!

విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని జరిగిన సంఘటనలు ఆధారంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలను దాటి ముందుకు సాగుతూ.. ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనే అంశాన్ని ఈ కథ మూలంగా తీసుకున్నారు.

‘అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు’ అంటూ రూపొందించిన ఈ బ్యానర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ‘ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్’ సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్తోంది.

టాలెంట్ వున్నవాళ్లకి గోల్డెన్ ఛాన్స్!

ఇదిలా ఉంటే, అనిల్ సుంకర ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. శర్వానంద్ , సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని ఆశిద్దాం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.