
ప్రముఖ నటి అంజలి, హీరో విశాల్‌తో మరోసారి సినిమాలో నటిస్తున్నారు. ‘మద గద రాజా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Key Points
విశాల్ 35వ సినిమాలో అంజలి కీలక పాత్ర
చెన్నైలో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం
రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రాఫర్‌గా
విశాల్-అంజలి కాంబో మళ్ళీ!
బ్యూటిపుల్ హీరోయిన్ అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్ అంజలి వచ్చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు.
చివరగా ‘మద గద రాజా’ అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిపించింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రను పోషించబోతోన్నారు. ఈ మేరకు విశాల్ 35 ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారన్నట్టుగా టీమ్ ప్రకటించింది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఘనమైన పూజా కార్యక్రమం
మార్క్ ఆంటోనీ విజయం తర్వాత జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి ఈ చిత్రానికి విశాల్‌తో కలిసి పనిచేస్తున్నారు. నటి దుషారా విజయన్ హీరో విశాల్ సరసన కథానాయికగా నటిస్తూ జోడీ కట్టనున్నారు. ఈ కొత్త చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ముఖ్యంగా ‘మధ గజ రాజా’ చిత్రం ఘన విజయం తర్వాత విశాల్ మరోసారి సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్‌తో కలిసి పనిచేయడం విశేషం.
సినిమా టీం వివరాలు
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), హీరో కార్తీ , జీవా, డిఓపి ఆర్థర్ ఎ విల్సన్, పంపిణీదారు తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
అలాగే మూవీ యూనిట్‌కు వారంతా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, ఈ కొత్త సినిమాలో విశాల్, దుషారా విజయన్, అంజలి తోపాటు తంబి రామయ్య, అర్జై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశాల్ 35వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అంజలి, దుషారా విజయన్‌తో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.


