|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Annapoorani Movie: ఓటీటీకి నయనతార వివాదాస్పద సినిమా.. వారికి మాత్రమే!

Published: 30-09-2025, 7:41 AM
Annapoorani Movie: ఓటీటీకి నయనతార వివాదాస్పద సినిమా.. వారికి మాత్రమే!

నయనతార నటించిన వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ ఓటీటీకి తిరిగి వస్తోంది. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసిందన్న ఆరోపణలతో నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించబడిన ఈ సినిమా హిందీ వెర్షన్ అక్టోబర్ 1 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూర్ణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్'.

2

ఈ సినిమా బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసిందన్న ఆరోపణలతో నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది.

4

దర్శకుడు నీలేశ్ కృష్ణ కాగా, తమన్ సంగీతం అందించారు.

అన్నపూర్ణి సినిమా వివాదం ఏమిటి?

కోలీవుడ్ భామ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం ‘అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్’. 2023లో వచ్చిన ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ థియేటర్ల వద్ద మిక్స్‌డ్‌ రివ్యూస్ వచ్చాయి. ఇందులో నయన్ బ్రహ్మణి అమ్మాయి పాత్రలో కనిపించింది. అదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు చేసే చెఫ్‌గా చూపించడం ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.

తాజాగా ఈ  చిత్రం మరో భాషలో అందుబాటులోకి వస్తోంది. అక్టోబర్ 1 నుంచి జియో హాట్‌ స్టార్‌లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్నపూరణి సినిమాను జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లపై ఆర్. రవీంద్రన్ మరియు జతిన్ సేథి నిర్మించారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు.

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వివరాలు

సినిమా నిర్మాణం, సాంకేతిక వర్గం

తీవ్ర వివాదాలు, నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగింపు తర్వాత ‘అన్నపూర్ణి’ చిత్రం హిందీ వెర్షన్‌లో ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమాను వీక్షించే అవకాశం బాలీవుడ్ ప్రేక్షకులకు లభించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.