
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ‘కథాసుధ’ అనే సిరీస్ ద్వారా ప్రతి ఆదివారం షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. జూన్ 15న ‘ప్రేమంటే ఇది కదా’ అనే కొత్త షార్ట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Key Points
ప్రతి ఆదివారం కొత్త షార్ట్ ఫిల్మ్‌తో ఈటీవీ విన్ 'కథాసుధ' సిరీస్
జూన్ 15న 'ప్రేమంటే ఇది కదా' అనే కొత్త షార్ట్ మూవీ స్ట్రీమింగ్
ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించబడింది
ఇప్పటికే 11 ఎపిసోడ్లు విడుదలై విజయవంతమైన 'కథాసుధ' సిరీస్
కథాసుధ సిరీస్‌లో కొత్త ఎపిసోడ్
ఓ తెలుగు షార్ట్ మూవీ ఒకటి నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం అందిస్తున్న కథాసుధలో భాగంగా ఈ వారం మరో కొత్త ఎపిసోడ్ రాబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా అన్ని 30 నుంచి 40 నిమిషాల నిడివితో ఉన్న షార్ట్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే.
ఈటీవీ విన్ ఓటీటీ లో వచ్చే ఆదివారం (జూన్ 15) నుంచి సరికొత్త షార్ట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ పేరు ప్రేమంటే ఇది కదా. కథా సుధ సిరీస్ లో భాగంగా వస్తున్న ఈ సరికొత్త ఎపిసోడ్ ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని గురువారం (జూన్ 12) ఈటీవీ విన్ వెల్లడించింది.
‘ప్రేమంటే ఇది కదా’ షార్ట్ మూవీ వివరాలు
“ప్రేమంటే ఇది కదా.. ప్రతి ప్రేమ కథకూ దానికి కావాల్సిన ముగింపు ఉండదు. ఇదో ఎమోషన్లు, హార్ట్ బ్రేక్, అవకాశాల కథ. కథా సుధ నుంచి వస్తోంది. జూన్ 15 నుంచి కేవలం ఈటీవీ విన్ లో.. ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ మిస్ కావద్దు” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీ కొన్ని నెలలుగా కథా సుధ పేరుతో ఓ సరికొత్త సిరీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఓ సరికొత్త షార్ట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 11 ఎపిసోడ్లు వచ్చేశాయి.
ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇప్పుడు వచ్చే ఆదివారం (జూన్ 15) 12వ ఎపిసోడ్ రానుంది. కథాసుధలో భాగంగా ఏప్రిల్ 6న తొలి మూవీ స్ట్రీమింగ్ అయింది. ఆ రోజు ఉత్తరం, లైఫ్ పార్ట్‌నర్ అనే రెండు ఎపిసోడ్లు వచ్చాయి.
ఆ తర్వాత లవ్ యు నానమ్మ, వెండి పట్టీలు, ట్రింగ్ ట్రింగ్, పెంకుటిల్లు, సుందరం గాడి ప్రేమ కథ, కాలింగ్ బెల్, నాతి చరామి, అమృతవల్లి, డియర్ డాడీలాంటి షార్ట్ మూవీస్ వచ్చాయి. ఇక ఇప్పుడు కొత్తగా ప్రేమంటే ఇది కదా రాబోతోంది. మరి ఈ మూవీతోపాటు మిగిలిన 11 ఎపిసోడ్లను కూడా ఈటీవీ విన్ ఓటీటీలోకి వెళ్లి కథాసుధ సిరీస్ లో చూడండి.
ప్రేమంటే ఇది కదా షార్ట్ ఫిల్మ్‌తో పాటు, ఇప్పటికే విడుదలైన 11 ఎపిసోడ్లను ఈటీవీ విన్ ఓటీటీలో చూడండి. ప్రతి ఆదివారం కొత్త కథలతో కథాసుధ సిరీస్ కొనసాగుతుంది.


