|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ANR Wife:పెళ్ళైన కొత్తలో ఏఎన్నార్ భార్య కోరిన చిన్న కోరిక, భర్త ముందే అసభ్యంగా అవమానించడంతో ఏం చేశారంటే

Published: 02-10-2025, 7:17 AM
ANR Wife:పెళ్ళైన కొత్తలో ఏఎన్నార్ భార్య కోరిన చిన్న కోరిక, భర్త ముందే అసభ్యంగా అవమానించడంతో ఏం చేశారంటే

ఏఎన్నార్ బాల్యం నుంచే నాటకాలు వేసి సినిమా రంగంలోకి వచ్చారు. నటులకు ఎంత క్రేజ్ ఉన్నా, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఏఎన్నార్ అన్నారు. తన భార్య అన్నపూర్ణ పెళ్ళైన కొత్తలో అనుభవించిన అవమానాన్ని, ఆమె సహనం గురించి ఏఎన్నార్ స్వయంగా వెల్లడించారు. ఈ సంఘటన ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో వివరించారు.

Key Points

1

పెళ్ళైన కొత్తలో భార్య కోరిక మేరకు ఏఎన్నార్ ఆమెను సినిమాకు తీసుకెళ్ళడం.

2

చెన్నై థియేటర్‌లో ఏఎన్నార్ భార్య అన్నపూర్ణను జనాలు అసభ్యంగా అవమానించడం.

4

నటుడి కుటుంబ సభ్యులకు సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులను ఏఎన్నార్ వివరించడం.

ఏఎన్నార్ భార్యకు ఎదురైన అవమానం

అక్కినేని నాగేశ్వరరావు బాల్యం నుంచే నాటకాలు వేయడం ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ లని ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని అభివర్ణిస్తుంటారు. ఎన్టీఆర్ కంటే ముందుగానే ఏఎన్నార్ ఇండస్ట్రీకి వచ్చారు. పాపులారిటీ సాధించారు. నటీనటులకు క్రేజ్ వస్తుంది కానీ వారి ఫ్యామిలీల పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. పాపులారిటీ వల్ల వచ్చే విమర్శలు, అవమానాలు సైతం దిగమింగాల్సి ఉంటుంది. నటుడి కుటుంబ సభ్యులు ఎంతో సహనంతో, లౌక్యంతో వ్యవహరించాలి. లేకపోతే కష్టం. ఆ విషయంలో నాకు గొప్ప భార్య దొరికింది అని ఏఎన్నార్ తన సతీమణి అన్నపూర్ణ గురించి తెలిపారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు.

ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య అన్నపూర్ణకి ఎదురైన ఘోర అవమానం గురించి మాట్లాడారు. ‘నాకు 1949లో వివాహం జరిగింది. అప్పటికే నేను నటించిన కీలుగుర్రం, లైలా మజ్ను లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలు తమిళంలో కూడా డబ్ అయి రిలీజ్ అయ్యాయి. అక్కడ కూడా హిట్ అయ్యాయి. అప్పటికి తెలుగుతో పాటు తమిళంలో కూడా నేనే స్టార్ ని. శివాజీ గణేష్, జెమినీ గణేశన్ లాంటి వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తుపట్టేవారు.

సినీ ప్రముఖుల కుటుంబ సభ్యుల కష్టాలు

పెళ్ళైన కొత్తలో నా భార్య ఇంగ్లీష్ పిక్చర్ చూడాలని ఉంది, తీసుకువెళ్ళండి అని కోరింది. దీనితో చెన్నైలో ఓ థియేటర్ లో సినిమాకి వెళ్లాం. నేను కనిపించగానే బాల్కనీలో ఉన్న వాళ్లంతా పైకి లేచారు. ఎవరో కొత్త పిల్లని పట్టుకుని వచ్చాడే వీడు.. ఆమె ఎవరు ? భానుమతా ? లేదు ఆమె లావుగా ఉంటుంది కదా.. లేకపోతే అంజలినా ? కాదు ఆమె పొట్టిగా ఉంటుంది కదా.. ఎక్కడో కొత్త పిల్లని పట్టుకుని వచ్చాడులే అంటూ చాలా అసభ్యంగా కామెంట్స్ చేయడం నాకు వినిపించింది. నా భార్య కూడా వారి మాటలు వింటూనే ఉంది. అంటే ఒక నటుడి పక్కన ఏ అమ్మాయి కనిపించినా వేశ్య తరహాలోనే చూసేవాళ్ళు. ఆ సంఘటన తర్వాత నా భార్య ఇంకెప్పుడూ బయటకి వచ్చి సినిమా చూడలేదు.

నేను సొంతంగా స్టూడియో, థియేటర్ కట్టిన తర్వాతే అక్కడ సినిమా చూసింది అని ఏఎన్నార్ తన భార్య గురించి తెలిపారు. పాపులారిటీ వల్ల నటుడి భార్య, చెల్లెళ్లకి కూడా ఇబ్బందులు ఉంటాయి. నటుడి భార్య కావడానికి కూడా చాలా ధైర్య సాహసాలు, తెలివితేటలు, ఓర్పు కావాలి. ఆ లక్షణాలన్నీ నా భార్యలో ఉన్నాయి అని ఏఎన్నార్ ప్రశంసలు కురిపించారు.

అన్నపూర్ణ సహనంపై ఏఎన్నార్ ప్రశంసలు

ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా తనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఏఎన్నార్ అన్నారు. ఆ తర్వాత పట్టుదలతో, కసితో ఇంగ్లీష్ నేర్చుకున్నానని ఏఎన్నార్ తెలిపారు.

ఒక చిన్న కోరిక కారణంగా ఏఎన్నార్ భార్యకు ఎదురైన చేదు అనుభవం ఆమెను బయట సినిమా చూడకుండా చేసింది. సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు ఎదురయ్యే కష్టాలకు ఇది నిదర్శనం. అన్నపూర్ణ సహనాన్ని, త్యాగాన్ని ఏఎన్నార్ ఎంతో ప్రశంసించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.