
📌 Key Points
- నటి అన్షు అంబానీ కూతురు షనయ తొలిసారి సెట్ లోకి అడుగుపెట్టింది.
- తన కూతురు సినీ రంగ ప్రవేశంపై అన్షు ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
- అన్షు 2002లో ‘మన్మథుడు’, ఆ తర్వాత ‘రాఘవేంద్ర’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- గత ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ సినిమాతో అన్షు రీ-ఎంట్రీ ఇచ్చింది.
నటి అన్షు అంబానీ కూతురు షనయ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తల్లికి మించిన అందంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షనయ మొదటిసారి సెట్లోకి అడుగుపెట్టగా, అన్షు తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ కొత్త స్టార్ కిడ్ గురించి వివరాలు.
అన్షు అంబానీ సినీ ప్రస్థానం
Anshu Ambani:సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఒక హోదాను కల్పించుకున్న తర్వాత ఆ సెలబ్రిటీలు తమ వారసులను తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు తమకంటూ ఒక స్టేటస్ లభించిన తర్వాత వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. అటు అభిమానులను కూడా అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ కిడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతేకాదు సెట్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆ కిడ్ పేరెంట్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఆమె ఎవరో కాదు మన్మధుడు సినిమాలో తన అందంతో, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న అన్షు అంబానీ (Anshu Ambani). 2002లో నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘మన్మధుడు’ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు సెకండ్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. చేసింది కొంతసేపు అయినా అందులో తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలు దోచుకుంది. లంగావోణీలో పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. మన్మధుడు సినిమా తర్వాత ప్రభాస్ కి జోడిగా ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించింది. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్ర పోషించిన ఈమె.. తన నాలుగో చిత్రం తమిళంలో నటించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది.
రీ-ఎంట్రీతో మళ్ళీ యాక్టివ్
ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 16 ఏళ్ల వయసులోనే ఇండియాకి వచ్చి అలా మన్మధుడు మూవీలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఇండస్ట్రీ నుండి దూరమయ్యాక 2003లో వివాహం చేసుకోగా.. ఈమెకు ఒక అమ్మాయి కూడా జన్మించింది. అయితే వైవాహిక జీవితాన్ని గడపడం కోసం ఇండస్ట్రీలో మళ్లీ అడుగుపెట్టలేదు. కానీ గత ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలు షేర్ చేసుకునే ఈమె తాజాగా తన కూతురు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అన్షు కూతురు షనయా (Shanaya) నిన్న తొలిసారి సెట్లోకి అడుగుపెట్టిన విషయాన్ని షేర్ చేస్తూ..” నా కూతురు షనయా మొదటిసారి సెట్లోకి అడుగు పెట్టింది.నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నాపై చూపించిన ప్రేమ, అభిమానం నా కూతురుపై కూడా చూపించండి” అంటూ షనయా ఎదురుగా క్లాప్ బోర్డు పట్టుకొని అన్షు కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షనయాకి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కూతురు షనయ సినీ రంగ ప్రవేశం
ఇకపోతే షనయా నటిస్తున్న చిత్రానికి హాలీవుడ్ లేడీ డైరెక్టర్ అలీనా ఇలిన్ (Alina ilin) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదొక హాలీవుడ్ చిత్రం అని మాత్రం స్పష్టం అవుతుంది.
BIG TV తెలుగు వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి Tags Anshu Ambani tollywood Share
అన్షు అంబానీ వారసురాలిగా షనయ సినీ రంగ ప్రవేశం తెలుగు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. తన కూతురుకు కూడా అభిమానుల ఆదరణ ఉండాలని అన్షు కోరుతోంది. ఈ కొత్త తరం స్టార్ కిడ్ సినీ ప్రస్థానం విజయవంతం కావాలని ఆశిద్దాం.


