
📌 Key Points
- నటి ప్రగతి సినిమాల్లో అవకాశాలు లేక డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు.
- డిప్రెషన్ నుండి బయటపడటానికి జిమ్, వెయిట్‌లిఫ్టింగ్ ఎంచుకున్నారు.
- టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు, రజత పతకాలు సాధించారు.
- జిమ్ వెళ్లినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నానని ప్రగతి చెప్పారు.
నటి ప్రగతి ఇటీవల సినిమాల్లో అవకాశాలు లేక డిప్రెషన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమె వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లి, టర్కీలో జరిగిన పోటీల్లో పతకాలు సాధించారు. జిమ్ చేయడంపై ట్రోల్స్ వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు.
ప్రగతి డిప్రెషన్‌కు కారణం?
Actress Pragathi: సినీనటి ప్రగతి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఈమె ఇండియా తరపున వెయిట్ లిఫ్టింగ్ (Weight Lifting)లో సంచలనాలను సృష్టిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మెడల్స్ సాధించిన ప్రగతి తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్ట్రస్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా బంగారు, రజిత పథకాలను సాధించిన సంగతి తెలిసిందే. ఇలా ఇండియా తరపున వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన ఈమె పట్ల పెద్ద ఎత్తున ఆ సెలబ్రిటీలు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టర్కీ నుంచి ఇండియా రావడంతో ఈమెకు ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రగతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఉన్నఫలంగా ఇలా స్పోర్ట్స్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ప్రగతి సమాధానం చెబుతూ నేను ఏ పని చేసిన అందులో 100% ఎఫర్ట్ పెట్టి పని చేస్తాను అయితే ఇటీవల కాలంలో సినిమాలలో నాకు సరైన అవకాశాలు రాలేదు. వేరే సినిమాలు చూసినప్పుడు ఈ పాత్రలో నేను ఎందుకు చేయలేకపోయాను అనే భావన నాలో కలిగింది..
వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రగతి సంచలనం
ఈ ఆలోచనతో తాను చాలా ఇబ్బంది పడ్డానని ఇక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే పరిస్థితులలోకి వచ్చానని తెలిపారు . అప్పుడే తాను జిమ్ వెళ్లటం వర్కౌట్ చేయడం జరిగిందని తద్వారా ఇలా వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్నానని తెలిపారు. అయితే నేను స్పోర్ట్స్ లో ఇలాంటి సక్సెస్ అందుకుంటానని ఊహించలేదు అంటూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు .అయితే తాను జిమ్ వెళ్లినప్పుడు ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ మానసికంగా దృఢంగా ఉన్నానని తెలిపారు.
తాను జిమ్ వెళ్లినప్పుడు వర్కౌట్స్ చేసి ఎంత సంతోషంగా అయితే బయటకు వస్తానో ఒక సినిమా చేసిన తర్వాత నాలో అలాంటి భావన కలగాలని అలాంటి పాత్రలు వచ్చినప్పుడే సినిమాలలో నటిస్తానని ప్రగతి తెలియజేశారు. ప్రగతి అంటే ఒకప్పుడు తల్లి అత్త పిన్ని పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు కానీ ఇటీవల ఈమె సినిమాలకు దూరం కావడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందిన ఇండియా తరుపున స్పోర్ట్స్ లో ఇలాంటి విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలలో అవకాశాలు లేకపోవడం వల్లే తాను స్పోర్ట్స్ వైపు అడుగులు వేశానని చెప్పటం విశేషం. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సినిమాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం తాను తమిళంలో ఒక సినిమా చేస్తున్నానని , త్వరలోనే ఈ సినిమా రాబోతుందని తెలిపారు. ఇకపై కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే తాను నటిస్తానని ప్రగతి ఈ సందర్భంగా తెలిపారు.
ట్రోల్స్‌పై ప్రగతి ధీమా
సినిమా అవకాశాలు లేకపోయినా, జిమ్ ట్రోల్స్‌ను ఎదుర్కొని ప్రగతి వెయిట్‌లిఫ్టింగ్‌లో విజయం సాధించారు. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల అనేక మందికి స్ఫూర్తినిస్తున్నాయి.


