|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవి సంచలనం: తొలి హిందీ సినిమా ట్రైలర్ విడుదల! ప్రేమ గెలుస్తుందా?

Published: 16-04-2026, 7:35 AM
సాయి పల్లవి సంచలనం: తొలి హిందీ సినిమా ట్రైలర్ విడుదల! ప్రేమ గెలుస్తుందా?
  • సాయి పల్లవి తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ మే 1న విడుదల కానుంది.
  • ఈ సినిమాలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు.
  • ట్రైలర్ లో సాయి పల్లవి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతిగా కనిపించనుంది.
  • ఈ సినిమాను తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో విడుదల చేస్తున్నారు.

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో సాయి పల్లవి అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతిగా కనిపించనుంది.

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ

Ek din Movie: ప్రస్తుత కాలంలో హీరోయిన్లు భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి(Sai Pallavi) కూడా సౌత్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఇప్పుడు నార్త్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగానే హిందీలో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఏక్ దిన్. బాలీవుడ్ బడా స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా రెండవ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటవ తేదీన తెలుగులో కూడా విడుదల కాబోతోంది. అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ , మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన రెండవ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సాయి పల్లవి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతిగా కనిపించనుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అబ్బాయి పాత్రలో జునైద్ ఖాన్ ఒదిగిపోయారు. ఇష్టమైన అమ్మాయితో ఒక్కరోజైనా సరదాగా గడపాలని అనుకుంటాడు జునైద్. అయితే అలాంటి రోజు వారి జీవితాల్లో వచ్చిందా? వచ్చినా ఆ ఒక్కరోజు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది? విధిని ఎదిరించి వారి ప్రేమ ఎలా గెలిచింది? అనే పాయింట్ ను దర్శకుడు సునీల్ పాండే చాలా సున్నితంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మరోసారి సాయి పల్లవి తన నేచురల్ యాక్టింగ్ తో హిందీ ఆడియన్స్ ను ఫిదా చేయబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఒక రోజు’ అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ లో సాయి పల్లవికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ సంపత్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

‘ఏక్ దిన్’ ట్రైలర్ విశేషాలు

సాయి పల్లవిని ఆఫీసులో చూసి జునైద్ ఇష్టపడతాడు. కానీ అప్పటికే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయితే ఒకసారి తమ కంపెనీ ఉద్యోగులంతా అచీవ్మెంట్ సాధిస్తారు. దీంతో కంపెనీ యజమాని జపాన్ ట్రిప్ కి తీసుకెళ్తారు. ఆ సమయంలో సాయి పల్లవి తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడాన్ని చూసి మరింత కృంగిపోతాడు జునైద్. ఎలాగైనా ఒక్కరోజైనా తనతో కలిసి ఉండాలని పరితపిస్తాడు. కట్ చేస్తే యాక్సిడెంట్. హాస్పిటల్ లో చేరుతుంది సాయి పల్లవి. ఆ సమయంలో ఆమెకున్న డిసీజ్ గురించి వైద్యులు చెబుతారు. దీంతో ఏం చేయాలో తెలియక సాయి పల్లవి తో సంతోషంగా సరదాగా గడపాలని నిర్ణయించుకుంటాడు. ఒక్కరోజు కోసం ఏవేవో తిప్పలు పడతారు . కానీ అసలు నిజం తెలిసేసరికి ఆమె చీదరించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలను తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.. అద్భుతమైన విజువల్స్ , ప్రేమ , ఎమోషన్ అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా చూపించారు. ఇందులో సాయి పల్లవి యాక్టింగ్ మరోసారి నేచురల్ గా అనిపించింది. ఏది ఏమైనా ట్రైలర్ తోనే అదరగొట్టేసారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు ఫలితాలు తెలియాలి అంటే మే ఒకటి వరకు ఎదురు చూడాల్సిందే.

తెలుగులో ‘ఒక రోజు’గా విడుదల

Tags junaid khan Sai Pallavi Share

సాయి పల్లవి తన సహజ నటనతో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుండటంతో ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.