|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Priyanka Chopra : వామ్మో.. గ్లోబల్ బ్యూటీ రేంజే వేరు..అన్ని వేల కోట్లా..?

Published: 14-02-2026, 12:05 AM
Priyanka Chopra : వామ్మో.. గ్లోబల్ బ్యూటీ రేంజే వేరు..అన్ని వేల కోట్లా..?
  • ప్రియాంక చోప్రా నటిస్తున్న రెండు సినిమాల బడ్జెట్ రూ.4200 కోట్లు.
  • మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం.
  • వారణాసి మూవీలో ప్రియాంక లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • సిటాడెల్ సీజన్ 1 లో ప్రియాంక యాక్షన్ రోల్ అందరినీ ఆకట్టుకుంది.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆమె నటిస్తుండటంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఆమె నటిస్తున్న సినిమాల బడ్జెట్ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమె ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళింది.. ఒకప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిన ఈ హీరోయిన్ ఇప్పుడు కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ప్రస్తుతం తెలుగులో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఈమె లుక్ బయటకు వచ్చింది. ఇది గనక హిట్ అయితే తెలుగులో వరుసగా ప్రియాంక చోప్రా కు అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందులో రాజమౌళి సినిమా కావడంతో ఎక్కువమంది ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈమె సినిమాల బడ్జెట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న నాలుగు సినిమాల బడ్జెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న రెండు సినిమాల బడ్జెట్ 4200 కోట్లు. ఇక నాలుగు సినిమాల బడ్జెట్ విషయానికొస్తే 5000 కోట్లకు పైమాటే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.. అన్ని వేల కోట్ల సినిమాలో నటిస్తుంది అంటే ఆమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒకేసారి 5000 కోట్ల బడ్జెట్లో సినిమాలలో నటించడం అంటే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి సాధ్యం కాదని చెప్పాలి.. ప్రస్తుతం ఈమె హాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. అక్కడ వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.. భారీ యాక్షన్ బడ్జెట్ సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం తెలుగులో ప్రియాంక చోప్రా నటిస్తున్న వారణాసి సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురానున్నారు.

ప్రియాంక చోప్రా నటిస్తున్న సినిమాల బడ్జెట్

హాలీవుడ్ లో ప్రియాంక జోరు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా లో ఈమె నటిస్తుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ విషయానికొస్తే..150 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందుతోంది.. అంటే సుమారు 1400 కోట్లకు ఇది సమానం. ఇకపోతే సిటాడెల్ సీజన్ 1 లో ప్రియాంక చోప్రా యాక్షన్ ప్యాక్డ్ రోల్ అందరి దృష్టిని ఆకర్షించింది. పీసీ నటించిన వాటిలో, కేవలం రెండు ప్రాజెక్టుల కోసం ఖర్చయిన బడ్జెట్ 4200 కోట్లు. హృతిక్ రోషన్ సరసన క్రిష్ 4 లో నటించాల్సి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు అని ప్రచారం ఉంది.. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండదని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టు మొదలవడానికి కాస్త ఆలస్యం కూడా పట్టేలా ఉంది. ఫర్హాన్ అక్తర్ తో జీలే జరా ఇలాంటి భారీ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లకు పైగానే.. మొత్తానికి ఈ నాలుగు సినిమాల బడ్జెట్ 5,000 కోట్లకు పైనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీ గురించి వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియాంక చోప్రా కేవలం ఒక నటిగానే కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో ఒక బ్రాండ్‌గా మారారు..

ప్రియాంక చోప్రా ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతుంది. రాజమౌళి సినిమాలో ఆమె నటన ఎలా ఉండబోతుందో చూడాలి. ఆమె రాబోయే సినిమాలు విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.