
రాజమౌళి-మహేష్ బాబు వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో రాజమౌళి దేవుడిపై, ముఖ్యంగా హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. ఆయన మాటలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Key Points
రాజమౌళి-మహేష్ బాబు 'వారణాసి' టైటిల్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈవెంట్‌లో సాంకేతిక లోపం వల్ల రాజమౌళి దేవుడిపై, హనుమంతుడిపై అసహనం వ్యక్తం చేశారు.
"నాకు దేవుడి మీద నమ్మకం లేదు" అని రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, భక్తులు, పలు హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి.
వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి వ్యాఖ్యలు
Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి భారీగా మహేష్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈవెంట్లో సంచారి సాంగ్ పెర్ఫార్మ్ చేసారు. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ అంతా మాట్లాడారు.(Rajamouli)
అయితే ఈ ఈవెంట్లో రాజమౌళి దేవుడి మీద, హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సాంకేతిక సమస్యతో దేవుడిపై అసహనం
ఈ ఈవెంట్లో వారణాసి రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనక ఉండి ఈ సినిమాని నడిపించారు అని అన్నారు. అయితే ఈ ఈవెంట్లో కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యంగా ఈవెంట్ మొదలైంది. రాజమౌళి చాలా ప్లానింగ్ అసహనానికి గురయ్యాడు.
ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. నాకు దేవుడి మీద నమ్మకం లేదండి. ఇందాక నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడుతూ టెన్షన్ పడకు అంతా హనుమ చూసుకుంటాడు, వెనకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ ఇందాక సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినప్పుడు ఇలానేనా నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమ కు హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఓ ఫ్రెండ్ లా మాట్లాడుతుంది. కానీ ఎందుకు ఇలా అయిందని కోపం వచ్చింది అన్నారు.
నెటిజన్లు, హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం
దీంతో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సాంకేతికంగా మీ దగ్గర ఏదో సమస్య వస్తే దేవుడ్ని అంటావా, చిన్న చిన్న సమస్యలకు కూడా దేవుడ్ని నిందిస్తావా అని నెటిజన్లు, భక్తులు ఫైర్ అవుతున్నారు. దేవుడి మీద నమ్మకం లేదు అంటావు కానీ దేవుడి పేరు మీద సినిమాలు తీసుకుంటూ డబ్బులు సంపాదిస్తావా అని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి మహేష్ సినిమా ఈవెంట్ ఏమో కానీ రాజమౌళి హనుమంతుడి మీద , దేవుడి మీద చేసిన వ్యాఖ్యలతో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. పలు హిందూ సంఘాలు కూడా ఆయన్ని తప్పుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి దీనిమీద స్పందించకపోతే ఈ ఘటన తీవ్రంగా మారడం ఖాయం అంటున్నారు.
రాజమౌళి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. పలు హిందూ సంఘాలు కూడా ఆయన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రాజమౌళి స్పందించకపోతే ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.


