|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dude Movie Collections: సెంచరీకి చేరువలో డ్యూడ్‌.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?

Published: 22-10-2025, 6:05 AM
Dude Movie Collections: సెంచరీకి చేరువలో డ్యూడ్‌.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?

ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దీపావళికి విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.95 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సెంచరీ క్లబ్‌కు చేరువలో ఉంది. దీనిపై మరిన్ని వివరాలు కింద చూడండి.

Key Points

1

డ్యూడ్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న థియేటర్లలో విడుదలైంది.

2

తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ సాధించింది.

4

ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా నటించారు.

డ్యూడ్ కలెక్షన్ల దూకుడు

డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude Collections). కోలీవుడ్ హీరో నటించిన ఈ సినిమాకు తెలుగులోనూ రిలీజైంది. లవ్ టుడే, డ్రాగన్‌ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న థియేటర్లలో విడుదలైంది.

అయితే తొలి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ సాధించింది. గతంలో రిలీజైన డ్రాగన్‌ కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.83 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే సెంచరీకి చేరువలోకి వచ్చేసింది. వరల్డ్‌ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వసూలు చేసింది.  ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించగా.. ఆర్‌. శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు.

వరల్డ్‌వైడ్‌గా ఐదు రోజుల వసూళ్లు

చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాలు

మొత్తం మీద, డ్యూడ్ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేస్తూ, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.95 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం త్వరలోనే సెంచరీ క్లబ్‌లోకి చేరడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.