|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌లో గుర్తింపు లేక నటుడు శ్రీమన్ ఆవేదన! అసలు కారణం ఇదేనా?

Published: 06-07-2026, 6:41 PM
టాలీవుడ్‌లో గుర్తింపు లేక నటుడు శ్రీమన్ ఆవేదన! అసలు కారణం ఇదేనా?
  • శ్రీమన్ తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.
  • తాను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పక్కా తెలుగువాడినని వెల్లడి.
  • టాలీవుడ్‌లో గుర్తింపు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
  • మొహమాటం వల్ల తెలుగు దర్శకులను అవకాశాలు అడగలేకపోయానని వివరణ.

ప్రముఖ నటుడు శ్రీమన్ టాలీవుడ్‌లో తనకు సరైన గుర్తింపు లభించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలుగువాడినైనప్పటికీ, తమిళ సినిమాల్లోనే ఎక్కువ నటించానని, టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎవరినీ అడగలేకపోయానని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నేను పక్కా తెలుగు వాడినే!

Sriman Tollywood: శ్రీమాన్ …పేరు పెద్దగా తెలీకపోవచ్చేమో కాని కనిపిస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తాం. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఆయన నటించిన కమల్ హాసన్ ‘పంచతంత్రం’, విజయ్ ‘గిల్లి’, ‘పోకిరి’, ‘భైరవ’ వంటి సినిమాలతో పాటు రాఘవ లారెన్స్ ‘కాంచన’ సినిమాలని అంత ఈజీగా మర్చిపోలేము. అలా ఎక్కువ తమిళ సినిమాల్లో వందలాది పాత్రలు వేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీమన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా గొల్లాలమామిడాడ

శ్రీమన్ మాట్లాడుతూ నేను తమిళ వాడినని,కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటుడిని అని ఎవరైనా అనుకుంటే అది పొరబాటని, తానూ పక్కా తెలుగు వాడినని, తమది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా గొల్లాలమామిడాడ అని చెప్పుకొచ్చాడు. అయితే చాలా ఏళ్ల క్రితమే తాము తమిళ నాడులో స్థిర పడటం వల్ల కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసానని తెలిపాడు.అయితే తాను తెలుగువాడిని అయినప్పటికీ టాలీవుడ్ లో తనకు అనుకున్నంత గుర్తింపు రాలేదని, అదొక పెద్ద వెలితిలాగా తనని వెంటాడుతుందని బాధపడిపోయాడు.

టాలీవుడ్‌లో అవకాశాల కోసం అడగలేకపోయా

టాలీవుడ్ లో ఎవరిని నోరు తెరిచి అడగలేకపోయా

ఇక ఇదే విషయాన్ని ఒక వీడియో లో చెబుతూ,ఎయిర్‌పోర్టుల్లోనో, రైల్వే స్టేషన్‌లలోనో తనని చూసిన వారు గుర్తు పట్టి తనతో సెల్ఫీలు దిగుతుంటారని, పైగా మీ యాక్టింగ్ చాలా బాగుంటుందని చెబుతుంటారని తెలిపారు.అయితే ఇంతా చేసి చివర్లో ఇంతకీ మీ పేరు ఏంటని అడగడం తనని ఎంతో బాధిస్తుందని మనసులోని బాధని బయట పెట్టాడు. ఇక తను చేసిన ఎన్నో తమిళ సినిమాలకి తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకున్నానని, అయితే డైరెక్ట్ గాస్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించి, ఇక్కడి డైలాగులు చెప్పి దాదాపు రెండు మూడు సంవత్సరాలు దాటిపోయిందని, తెలుగులో మంచి ఒక మంచి దర్శకుడితో చేయాలని కోరిక గొంతు వరకు ఉన్నా ఎవరిని నోరు తెరిచి అడగలేకపోయాయని, అయితే అడగనిది అమ్మైనా అన్నం పెట్టదన్న విషయం తెలుసని ,కాని తనకున్న మొహమాటం కొద్ది టాలీవుడ్ లో ఎవరిని నోరు తెరిచి అడగలేకపోయాయని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర

అనిల్ రావి పూడి,వెంకీ,కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్ర

అయితే తాజాగా అనిల్ రావి పూడి,వెంకీ,కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాలో శ్రీమాన్ కి కీలక పాత్రని ఆఫర్ చేశాడని, ఇందుకోసం అప్పటికే కోలీవుడ్ లో ఏకంగా అప్పటికే ఒప్పుకున్న నాలుగు సినిమాలని కూడా వదిలేశానని తెలిపాడు.అయితే ఈ సినిమా శ్రీమాన్ కి దక్కడం వెనుక ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఉంది. అవును…. విజయ్ హీరోగా నటించిన ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా షూటింగ్ 2022 లో జరుగుతున్న సమయంలోనే నిర్మాత దిల్ రాజు ద్వారా శ్రీమాన్ అనిల్ రావి పూడికి పరిచయం అవడం, అప్పటికే తమిళ సినిమాలు చూసిన అనిల్ శ్రీమాన్ ని గుర్తు పెట్టుకుని మరీ ప్రస్తుతం ఇపుడు రాబోతున్న తన సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడట.

చూడాలి మరి ఈసారి టాలీవుడ్ లో ‘శ్రీమన్ అంటే ఒక పక్కా తెలుగు కుర్రోడు’గా అని రిజిస్టర్ అవుతా అని కాన్ఫిడెన్స్ చూపిస్తున్న శ్రీమాన్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.

శ్రీమన్ తన మనసులోని బాధను వెల్లడించడంతో, ఆయనకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మొహమాటం పక్కనపెట్టి మరింత చురుకుగా ఉండాలని సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.