|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్ నటి జీవితంలో చీకటి కోణం: పసిపాపతో రాత్రికి రాత్రే పలాయనం! కారణం ఏమిటి?

Published: 11-06-2026, 4:30 PM
స్టార్ నటి జీవితంలో చీకటి కోణం: పసిపాపతో రాత్రికి రాత్రే పలాయనం! కారణం ఏమిటి?
  • నటి ఎవా గ్రోవర్ ఆమిర్ ఖాన్ సవతి సోదరుడిని 18 రోజుల్లోనే పెళ్లి చేసుకుంది.
  • పెళ్లి తర్వాత భర్త హైదర్ అలీ ఖాన్ నుండి శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొంది.
  • బిడ్డ పుట్టిన తర్వాత కూడా వేధింపులు పెరగడంతో పసిపాపతో ఇల్లు వదిలి వచ్చింది.
  • ఆమిర్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా ఈ బంధంపై ఆమెను ముందుగానే హెచ్చరించారు.

ప్రముఖ నటి ఎవా గ్రోవర్ వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణం ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఆమిర్ ఖాన్ సవతి సోదరుడితో తన పెళ్లి, ఆ తర్వాత అనుభవించిన కష్టాలు, వేధింపుల గురించి ఆమె ఇటీవల వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఎవా గ్రోవర్ ప్రేమ, పెళ్లి వెనుక విషాదం

Eva Grover: ప్రముఖ నటి ఎవా గ్రోవర్ వ్యక్తిగత జీవితంలో దాగున్న ఒక చీకటి కోణం ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సవతి సోదరుడు హైదర్ అలీ ఖాన్‌తో తన పెళ్లి, ఆ తర్వాత తను అనుభవించిన కష్టాల గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం 18 రోజుల పరిచయం, ఆపై ప్రేమ అనే భ్రమలో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో చెప్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘రెడీ’ (2011)లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో, అలాగే ‘కుంకుమ్ – ఏక్ ప్యారా సా బంధన్’ (2002), ‘బడే అచ్చే లగ్తే హై’ (2011) వంటి సెన్సేషనల్ టీవీ సీరియల్స్ ద్వారా ఎవా గ్రోవర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో పెద్ద తప్పటడుగు వేసేసింది. హైదర్ అలీ ఖాన్‌తో పరిచయమైన కేవలం 18 రోజుల్లోనే ఆమె పెళ్లి పీటలెక్కేసింది.

భర్త వేధింపులు: నరకప్రాయమైన జీవితం

నిజానికి ఈ వివాహం ఎవా తల్లికి అస్సలు ఇష్టం లేదు. అంత తక్కువ సమయంలో ఆ వ్యక్తీ ఎలాంటి వాడో అని అంచనా వేయడం కష్టమని చెప్పినా వినకుండా ముందుకు వెళ్ళిపోయింది. అంతెందుకు, స్వయంగా ఆమిర్ ఖాన్ కూడా ఈ బంధం విషయంలో ఎవాను ముందుగానే హెచ్చరించడం గమనార్హం. అయినా సరే, ఆమె ఎవరి హెచ్చరికలను లెక్కచేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుంది.

అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే ఎవా డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. హైదర్ అసలు స్వరూపం బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. రోజూ ఫిజికల్ హెరాస్ మెంట్, మెంటల్ హెరాస్ మెంట్ తో ఇంటిని ఒక నరకంగా మార్చేశాడు హైదర్.అయినప్పటికీ, ఎలాగైనా తన సంసారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో, ఒక బిడ్డ పుడితేనైనా భర్త మారుతాడేమోననే ఆశతో ఒక పాపకు జన్మనిచ్చింది ఎవా.అయినా కానీ హైదర్ మారలేదు. పైగా కూతురు పుట్టిన నెలరోజులకే ఈ టార్చర్ మరింత ఎక్కువైపోయింది. దీంతో తన పసిపాపని తీసుకొని పుట్టింటికి చేరింది.

పసిపాపతో ఇల్లు వదిలి వచ్చిన నటి

ఆ సమయంలో ఆమెకు తన తోటి నటీనటులు, షూటింగ్ యూనిట్ సభ్యులు కొండంత అండగా నిలిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హైదర్ వైపు కుటుంబ సభ్యులైన ఆమిర్ ఖాన్ తండ్రి, దివంగత ప్రముఖ నిర్మాత తాహిర్ హుస్సేన్, అలాగే అత్తగారు షహనాజ్ కూడా ఎవాకే మద్దతుగా నిలిచారు. హైదర్ తప్పును వారు సమర్థించకపోవడమే కాకుండా, ఎవాకు ధైర్యాన్ని నూరిపోశారు.

చివరకు, ఐదేళ్ల పాటు సాగిన కోర్టు పోరాటాలు, నరకయాతన తర్వాత ఆమె హైదర్‌కు అధికారికంగా విడాకులు ఇచ్చి ఆ బంధం నుంచి విముక్తి పొందారు. ఈ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ఒక్కోసారి మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని ఎవా గ్రోవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగిల్ మదర్‌గా తన కూతురిని పెంచుకుంటూ, మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడుతున్న ఎవా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఎవా గ్రోవర్ జీవితంలో ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం ఎంతోమందికి ఒక గుణపాఠం. తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, కష్టాల్లో ధైర్యంగా నిలబడటం ఎంత ముఖ్యమో ఆమె కథ తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.