
📌 Key Points
- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్ 2026-27 విడుదల.
- పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 31, 2026.
- అధికారిక వెబ్‌సైట్ anucde.info ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శుభవార్త అందించింది. 2026-27 విద్యాసంవత్సరానికి పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా కోర్సులకు ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ANUCDE ప్రవేశాల నోటిఫికేషన్ 2026-27
ANUCDE Admission Notification 2026 : దూర విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.
అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా ఆగస్టు 31, 2026ని నిర్ణయించారు. ఈ లోపే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం… ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్ తో పాటు పలు పీజీ డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు, దరఖాస్తు విధానం
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం అధికారిక వెబ్‌సైట్ www.anucde.info సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ల గురించి ఏవైనా సందేహాలుంటే [email protected] కు ఈమెయిల్ చేయవచ్చు. అంతేకాకుండా 0863-2346222 / 2346208 / 2346214 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.
ముఖ్యమైన తేదీలు, సంప్రదింపు వివరాలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ ప్రవేశ నోటిఫికేషన్ దూరవిద్య ద్వారా తమ విద్యా లక్ష్యాలను చేరుకోవాలనుకునే వారికి గొప్ప అవకాశం. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ ఆగస్టు 31, 2026 లోపు దరఖాస్తు చేసుకొని, తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించడమైనది.


