|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుదీప్ ‘ఫంకీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్! వెంకీతో కాంబో లేనట్టేనా? ఇండస్ట్రీపై సెటైర్లతో దుమ్మురేపేందుకు రెడీ!

Published: 10-02-2026, 2:05 PM
అనుదీప్ 'ఫంకీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్! వెంకీతో కాంబో లేనట్టేనా? ఇండస్ట్రీపై సెటైర్లతో దుమ్మురేపేందుకు రెడీ!
  • ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల! ప్రేమికుల రోజున కామెడీ ట్రీట్!!
  • విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా రొమాంటిక్ ఎంటర్టైనర్
  • హరీష్ శంకర్, దిల్‌ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో మెరుపులు!
  • ‘ఫంకీ’లో సినిమా ఇండస్ట్రీపై సెటైర్లు పేలబోతున్నాయ్! బడ్జెట్‌ పెంచే వారిపై పంచ్‌లు!!

టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌! అనుదీప్ కేవీ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘ఫంకీ’ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో వేచి చూడాల్సిందే.

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ విడుదల: కామెడీ ట్రీట్ రెడీ!

దర్శకుడు అనుదీప్‌ కేవీ `జాతిరత్నాలు` మూవీతో తానేంటో నిరూపించుకున్నాడు. ఇన్నోసెంట్‌ కామెడీతో ఆకట్టుకున్నాడు. బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. ఆ తర్వాత `ప్రిన్స్` అని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు మళ్లీ తన జోనర్‌లోనే `ఫంకీ` మూవీ చేస్తున్నారు. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ సాగుతుందని, ట్రైలర్‌ చూస్తే అర్థమయ్యింది. ఇందులో విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ నటించారు. లవ్‌, కామెడీ, రొమాన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేమికుల రోజు స్పెషల్‌గా విడుదల కాబోతుంది. నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. `ఫంకీ` మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇది కామెడీ ప్రధానంగా సాగే చిత్రం అని, డైలాగ్‌ కామెడీ ఎక్కువగా ఉంటుందన్నారు. సెటైర్లు, పంచ్‌లతో నవ్విస్తూ సినిమా సాగిపోతుందన్నారు. కేవలం కామెడీ మాత్రమే కాదు, కొన్ని ఆలోచింప చేసే విషయాలు, ఎమోషనల్‌ విషయాలు కూడా ఉంటాయని ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందన్నారు. ఇందులో చాలా సెటైర్లు ఉంటాయని, సినిమా బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ కావడంతో సినిమా ఇండస్ట్రీపై కొన్ని సెటైర్లు ఉంటాయని చెప్పారు. అవి పాజిటివ్‌గానే ఉంటాయన్నారు.

సినిమా ఇండస్ట్రీపై సెటైర్లు: అనుదీప్ పంచ్‌లు!

దీనికితోడు ఇందులో కొందరు సెలబ్రిటీలు మెరుస్తారట. హరీష్‌ శంకర్‌, దిల్‌ రాజు, నాగవంశీతోపాటు మరికొందరు కనిపిస్తారని, సందర్భానుసారంగానే వాళ్లు వచ్చిపోతారని తెలిపారు. తాను కూడా కాసేపు మెరవబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బడ్జెట్‌ అనేది సమస్యగా మారుతుంది. ముందు అనుకున్న బడ్జెట్‌ ఒకటి, తీసేది మరో బడ్జెట్‌లో, చాలా పెరిగిపోతూ ఇబ్బంది అవుతుంది. దీంతో అలా బడ్జెట్‌ ఎక్కువ చేసే వారిపై, ఇండస్ట్రీపై సెటైర్లు ఉంటాయని తెలిపారు. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించిన్టటు చెప్పారు. అలాగే నిజ జీవితంలో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా ఉంటుందన్నారు అనుదీప్‌.

`ఫంకీ` మూవీలో నుంచి ఇటీవల విడుదలైన యమ్మా యమ్మా సాంగ్‌ యావరేజ్‌ టాక్‌ వచ్చింది. దీనిపై అనుదీప్‌ స్పందిస్తూ ఈ సాంగ్‌ తనకు నచ్చలేదని, స్పందన అంతగా లేదని తెలిపారు. అంతేకాదు రొమాంటిక్‌ సాంగ్‌ తీయడం కూడా తనకు ఇష్టం లేదని, తాను అలాంటి సీన్లు తీయడానికి ఇబ్బంది పడతానని తెలిపారు. రొమాంటిక్‌ సీన్లు తనకు నచ్చవని పేర్కొన్నారు. వాటికి తాను దూరం అని వెల్లడించారు.

విశ్వక్ సేన్, కయాదు లోహర్ జోడి: రొమాంటిక్ ఎంటర్టైనర్!

ఇక తాను కామెడీ చిత్రాలే కాదు, రాను రాను జోనర్‌ మారుస్తానని, అన్ని రకాల సినిమాలు చేస్తానని తెలిపారు. జోనర్‌ మార్చినా తన మార్క్ కామెడీ ఉంటుందన్నారు. అదే సమయంలో ప్రస్తుతం మూడు ప్రొడక్షన్‌ హౌజ్‌లతో అడ్వాన్స్ లు ఉన్నాయని, ఎందులో నెక్ట్స్ సినిమా చేస్తానో క్లారిటీ లేదన్నారు. ఇక వెంకటేష్‌ తో సినిమా చేయాల్సి ఉందని, కథ కుదరలేదని, ప్రస్తుతం వర్క్ చేస్తున్నానని, ఆయనకు నచ్చితే సినిమా చేస్తామని తెలిపారు. వెంకీకి స్క్రిప్ట్ నచ్చితే వెంటనే ఓకే అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇక ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్‌ కథపై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. వెంకీ మూవీ సెట్‌ కాకపోతే ఈ  సినిమానే చేసే ఛాన్స్ ఉందన్నారు.

అనుదీప్ కేవీ ‘ఫంకీ’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కామెడీ, రొమాన్స్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.