
తెలుగు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా జూలై 17న విడుదలవుతోంది. సెన్సార్ సమస్యల తర్వాత పేరు మార్చిన ఈ సినిమా కోర్టు రూమ్ థ్రిల్లర్ డ్రామా.
Key Points
అనుపమ పరమేశ్వరన్ నటించిన 'జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా జూలై 17న విడుదల.
కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అత్యాచార బాధితురాలి కథను చూపుతుంది.
సెన్సార్ బోర్డ్ సమస్యల తర్వాత సినిమా టైటిల్ మార్పులు చేయాల్సి వచ్చింది.
సురేష్ గోపి అనుపమతో కలిసి ప్రధాన పాత్రలో నటించాడు.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విడుదల తేదీ
తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ ‘జానకి వర్సెస్ కేరళ’. లెక్క ప్రకారం జూన్ చివరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం పెట్టింది. సీతాదేవి మరోపేరు జానకి అని, దీని వల్ల రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ ఉండొచ్చని, అందుకే కచ్చితంగా పేరు మార్చాల్సిందే అని పట్టుబట్టింది. మూవీ టీమ్ తొలుత దీనికి అంగీకారం తెలపలేదు. ఎట్టకేలకు ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది.
జానకి వర్సెస్ కేరళ అని అనుకున్న టైటిల్‌ని సెన్సార్ బోర్ట్.. ‘జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా మార్చింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.
సినిమా కథాంశం
ట్రైలర్ బట్టి చూస్తే.. సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఈమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకకి న్యాయం దక్కిందా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి ఈ కోర్ట్ రూమ్ డ్రామా, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
సెన్సార్ సమస్యలు
చివరకు జానకికి న్యాయం జరిగిందా లేదా అనేది చూడాలి. కోర్టు డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online