|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అర్ధరాత్రి అనుపమ ఫోన్ కాల్ ఎవరికో తెలుసా? వైరల్ అవుతున్న ప్రేమ వార్తలు!

Published: 19-02-2026, 9:35 PM
షాకింగ్: అర్ధరాత్రి అనుపమ ఫోన్ కాల్ ఎవరికో తెలుసా? వైరల్ అవుతున్న ప్రేమ వార్తలు!
  • అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ మధ్య డేటింగ్ రూమర్స్ వైరల్!
  • ముంబై అవార్డు ఈవెంట్లో ధ్రువ్‌కు అనుపమ బర్త్ డే విషెస్!
  • అర్ధరాత్రి 2 గంటలకు ధ్రువ్‌కు ఫోన్ చేస్తానన్న అనుపమ కామెంట్స్!
  • సోషల్ మీడియాలో ధ్రువ్, అనుపమ సెల్ఫీలు వైరల్.

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ కామెంట్స్! ధ్రువ్ విక్రమ్ తో ఆమెకున్న అనుబంధంపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయం తెలుసుకుందాం!

అనుపమ, ధ్రువ్ మధ్య ఏం జరుగుతోంది?

స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కెరీర్‌ను ముందుకు సాగిస్తుంది. పోయిన సంవత్సరం ఈమె నటించిన చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో బైసన్, క్రిష్టిందపురి చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. బైసన్ మూవీలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ కుమారుడు అయిన ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించాడు. అనుపమ రీసెంట్ టైంలో చేసిన కొన్ని కామెంట్స్ అనుపమ, ధ్రువ్ మధ్య ఏదో ఉందనే వైపు దారి తీస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అవార్డు వేడుకలో అనుపమ కామెంట్స్ వైరల్!

తాజాగా ముంబైలో జరిగిన ఓ అవార్డు ఈవెంట్లో అనుపమ పాల్గొంది. ఈ వేడుకల్లో ఈ బ్యూటీ ధ్రువ్ తో కలిసి సందడి చేసింది. ఆ అవార్డు వేడుకల్లో ఏకంగా స్టేజీపై అనుపమ ఈ నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ తర్వాత ఈ అవార్డు వేడుకల్లో అనుపమకు మీకు అర్జెంటు పని పడితే, అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు గంటలు అవుతుంది. అలాంటి సమయంలో మీరు ఎవరికి కాల్ చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది.

డేటింగ్ రూమర్స్‌పై స్పందిస్తారా?

దీనికి ఈమె… నేను అర్ధరాత్రి రెండు గంటలకు ధ్రువ్ కి ఫోన్ చేస్తానని సరదాగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో అనుపమతో ఉన్న ఒక సెల్ఫీని ధ్రువ్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా వరుసగా వీరిద్దరూ ఒకే ప్రదేశంలో కలిసి ఉండడం, చాలా క్లోజ్గా ఉంటూ వస్తుండడంతో కొంతమంది వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు, ఈ ఇద్దరి నటుల మధ్య ఏదో నడుస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ఇద్దరు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

అనుపమ, ధ్రువ్ లవ్ ట్రాక్ గురించి వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.