|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుపమ పెళ్లి వార్తల్లో నిజమెంత? ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందా? అసలు విషయం ఇదే!

Published: 06-04-2026, 9:05 AM
అనుపమ పెళ్లి వార్తల్లో నిజమెంత? ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందా? అసలు విషయం ఇదే!
  • అనుపమ పరమేశ్వరన్ త్వరలో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు వార్తలు.
  • మే నెలలో అనుపమ నిశ్చితార్థం జరుగునుందని సమాచారం.
  • విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్తో అనుపమ రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు.
  • అనుపమ, ధృవ్ ఒకే లొకేషన్లో ఫోటోలు షేర్ చేయడం ద్వారా సంబంధాన్ని సూచిస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.

టాలీవుడ్లో మరో పెళ్లి వార్త హల్చల్ చేస్తోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. మే నెలలో ఆమె నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అనుపమ పరమేశ్వరన్ పెళ్లి వార్తలు

Anupama Parameswaran: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెళ్లి భాజలు మోగుతున్న సంగతి తెలిసిందే. 2026 సంవత్సరం ప్రారంభం నుంచి సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే అల్లు శిరీష్ కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మరొక ముద్దు గుమ్మ సైతం పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు . ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగు , తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే తాజాగా ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే అనుపమ పరమేశ్వరన్ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని, మే నెలలో ఈమె నిశ్చితార్థం జరగబోతుందని ఇప్పటికే ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధృవ్ విక్రమ్తో రిలేషన్ నిజమెంత?

ఇలా అనుపమ పరమేశ్వరన్ నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారడంతో ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే విషయంపై కూడా చర్చలు మొదలయ్యాయి అయితే అనుపమ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఇది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది తెలియాల్సి ఉంది. ఇక అనుపమ పరమేశ్వరన్ పెళ్లి గురించి గత కొంతకాలంగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి . అనుపమ రిలేషన్ గురించి పెళ్లి గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం ఎక్కడ ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు.

ధృవ్ విక్రమ్ తో అనుపమ రిలేషన్…

నిశ్చితార్థం ఎప్పుడు? ఎక్కడ?

ఈ నేపథ్యంలోనే అనుపమ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా అనుపమ ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు లైక్స్ కొట్టడం, ఇద్దరు ఒకే లొకేషన్ లోనే వేరువేరు ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ తమ రిలేషన్ గురించి పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ధృవ్,అనుపమ ఎక్కడ స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరాయి. ఇక వీరిద్దరూ జంటగా బైసన్ అనే సినిమాలు నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు బయటకు వచ్చాయి.

అనుపమ పరమేశ్వరన్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం ఆమె పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.