|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anupama Parameswaran: ‘సెట్స్‌లో ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారని అడిగితే?’

Published: 12-08-2025, 9:45 AM
Anupama Parameswaran: 'సెట్స్‌లో ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారని అడిగితే?'

అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడింది. సెట్స్‌లో సమయ వ్యర్థం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సినిమా సెట్స్‌లోని సమయ వ్యర్థం గురించి మాట్లాడారు.

2

షూటింగ్ ఆలస్యాల వల్ల నటీమణులు ఎదుర్కొనే సమస్యలను ఆమె వెల్లడించారు.

4

'పరదా' సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది.

‘పరదా’ సెట్స్‌లోని అనుభవాలు

అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన తాజా చిత్రం ‘పరదా’. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు . ఇప్పటికే పరదా ట్రైలర్ ‌ రిలీజ్ చేయగా .. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది . డైరెక్టర్ ప్రవీణ్ సైతం రివ్యూలు బాగుంటేనే పరదా చూడాలని ఆడియన్స్ ‌ కు సవాల్ విసిరారు . ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది . ఈ సందర్భంగా మూవీ సెట్ ‌ లో షాట్ ‌ ఆలస్యం కావడంపై స్పందించింది .

షూటింగ్ ఆలస్యాలపై అనుపమ అభిప్రాయం

అనుమప మాట్లాడుతూ ..’ ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు నోరు విప్పడానికి భయపడతారు . ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అంటారు . ఉదయం 7 గంటలకు షూట్ ‌ కు వెళ్తే .. 9:30 వరకు వెయిట్ చేయాలి . ఎందుకు ఆలస్యమైందని అడిగితే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ముద్ర వేస్తారు . కో యాక్టర్ ఆలస్యంగా వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలి . ముందుగానే సెట్ ‌ కు పిలిచి రెండున్నర గంటల పాటు ఎందుకు వెయిట్ చేయిస్తున్నారు . ఈ గ్యాప్ ‌ లో చాలా షాట్స్ తీయొచ్చు కదా ‘ అని మేకర్స్ ‌ ప్రశ్నించారు .

నటీమణుల సమస్యలు

కాగా .. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.

అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘పరదా’ చిత్రం ఆగష్టు 22న విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర మరియు సినిమా ప్రమోషన్స్ గురించి ఆమె వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.