
📌 Key Points
- అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా ‘క్రేజీ కళ్యాణం’ను ప్రకటించారు.
- ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ రాజ్ తో కలిసి నటిస్తున్నారు.
- ‘క్రేజీ కళ్యాణం’ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
- ఈ సినిమా 100% లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన కొత్త సినిమా ‘క్రేజీ కళ్యాణం’ను ప్రకటించారు. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ రాజ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లవ్ కామెడీ ఎంటర్టైనర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అనుపమ కొత్త సినిమా ‘క్రేజీ కళ్యాణం’ ప్రకటన
Anupama Parameswaran: ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ గత ఏడాది వరస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలను విడుదల చేయగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన వెంటనే అనుపమ మరో క్రేజీ సినిమాని ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ “క్రేజీ కళ్యాణం” (Crazy Kalyanam)అనే సినిమాకు కమిట్ అయ్యారని ఈమె తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలియ చేశారు.
ఈ సందర్భంగా తన కొత్త సినిమా క్రేజీ కళ్యాణం సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ అసలు విషయాన్నీ వెల్లడించారు. ఈ సినిమా భద్రప్ప గాజుల (Badrappa Gajula)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ (Akhil Raj)కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. గత కొంతకాలంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా నటుడు అఖిల్ రాజ్ తో అనుపమ సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే అనుపమ నేడు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు.
సినిమాలో కీలక పాత్రధారులు, వివరాలు
ఇక ఈ సినిమాని ఆరో సినిమాస్ బ్యానర్ పై భూసమ్ జగన్మోహన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమా 100% లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందని అనుపమ తెలియచేశారు. ఇక అనుపమ గత ఏడాది బైసన్, కిస్కిందపురి, డ్రాగన్, పరదా, జే ఎస్ కే వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో బైసన్, కిస్కిందపురి, డ్రాగన్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు .ఇక అనుపమ నటించిన లాక్డౌన్ సినిమా కూడ గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
గత ఏడాది అనుపమ కెరీర్ హైలైట్స్
ఈ సినిమా డిసెంబర్ 5 వ విడుదలకు సిద్ధమైంది అదే సమయంలోనే బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వాయిదా వేశారు . లాక్ డౌన్ సమయంలో ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీన త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనుపమ హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక అఖిల్ రాజ్ ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం అనుపమతో సినిమా చేయబోతుండటం విశేషం.
గత ఏడాది వరుస విజయాలతో దూసుకుపోయిన అనుపమ, ఇప్పుడు ‘క్రేజీ కళ్యాణం’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ లవ్ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ పనులు జరుగుతుండగా, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.


