|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుపమ ‘మరీచిక’ నుంచి ఊహించని షాక్! సెకండ్ సింగిల్ ‘వెన్నెల తునక’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published: 22-05-2026, 5:31 PM
అనుపమ ‘మరీచిక’ నుంచి ఊహించని షాక్! సెకండ్ సింగిల్ ‘వెన్నెల తునక’ రిలీజ్ డేట్ ఫిక్స్!
  • నేషనల్ అవార్డు డైరెక్టర్ సతీష్ కాసెట్టి తెరకెక్కించిన ‘మరీచిక’ మే 29న రిలీజ్ కానుంది!
  • అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది!
  • ‘మరీచిక’ చిత్రం నుంచి రెండో సింగిల్ ‘వెన్నెల తునక’ మే 23న ఉదయం 11కి విడుదల!
  • చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మరీచిక’ సినిమా పేరే వినిపిస్తోంది! నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడు మరో మాస్ అప్డేట్‌తో మేకర్స్ సిద్ధమయ్యారు!

‘మరీచిక’ ట్రైలర్ తర్వాత మరో సంచలనం!

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తెరకెక్కిస్తున్న లెటెస్ట్ సరికొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’. రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్.. సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపింది. అంతే కాకుండా.. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు టర్నులతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం ఈనెల 29న రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వెన్నెల తునక’ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు.. ‘వెన్నెల వెలుగులా అనిపించే మధురమైన రాగం.. మరీచిక నుంచి రెండవ సింగిల్ ‘వెన్నెల తునక’ మే 23న ఉదయం 11 గంటలకు విడుదల అవుతోంది’ అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా.. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్ అభిమానులకు పండగే!

‘వెన్నెల తునక’ సాంగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

మొత్తానికి ‘మరీచిక’ నుంచి రాబోయే ఈ ‘వెన్నెల తునక’ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మే 29న థియేటర్లలో ఈ థ్రిల్లర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.