
📌 Key Points
- అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో కొత్త తెలుగు సినిమా.
- సినిమా టైటిల్ ‘క్రేజీ కళ్యాణం’ను మేకర్స్ ఇవాళ విడుదల చేశారు.
- ఇది 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన క్రేజీయెస్ట్ కాంబినేషన్.
- గతేడాది 7 సినిమాలతో అనుపమ రికార్డు; ఈ ఏడాది కూడా ఆమె దూకుడు కొనసాగుతోంది.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో ఒక కొత్త తెలుగు సినిమా రాబోతోంది. ‘క్రేజీ కళ్యాణం’ పేరుతో ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ టైటిల్ ను మేకర్స్ విడుదల చేశారు. 100 శాతం ఎంటర్ టైన్మెంట్ తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.
‘క్రేజీ కళ్యాణం’ టైటిల్ ప్రకటన
క్రేజీ కాంబినేషన్ తో, క్రేజీ టైటిల్ తో తెలుగులో కొత్త సినిమా రాబోతుంది. అనుపమ పరమేశ్వరణ్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా టైటిల్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు.
అందాల భామ అనుపమ పరమేశ్వరణ్ మరో కొత్త మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తోంది. గతేడాది ఏడు సినిమాలతో రికార్డు క్రియేట్ చేసిన అనుపమ కొత్త ఏడాదిలోనూ దూకుడు కొనసాగిస్తోంది. ఆమె లేటెస్ట్ సినిమాకు క్రేజీ టైటిల్, క్రేజీ కాంబినేషన్ కుదిరింది. ఆ సినిమా పేరు ‘క్రేజీ కళ్యాణం’ అని మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు.
అనుపమ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్
‘‘ఆరో సినిమాస్ ప్రొడక్షన్ నంబర్ 2 క్రేజీ కళ్యాణం. ఇదే క్రేజీయెస్ట్ కాంబినేషన్. అది కూడా 100 శాతం ఎంటర్ టైన్మెంట్ తో’’ అని సోషల్ మీడియాలో సోమవారం (జనవరి 5) పోస్టు చేశారు.
నూతన సంవత్సరంలో అనుపమ దూకుడు
2025లో డ్రాగన్ (తమిళం), జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ కేరళ (మలయాళం), పరదా, కిష్కింధపురి (తెలుగు), ది పెట్ డిటెక్టివ్ (మలయాళం), బైసన్, లాక్ డౌన్ (తమిళం) సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది అనుపమ పరమేశ్వరణ్.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ల ‘క్రేజీ కళ్యాణం’ మూవీతో ప్రేక్షకులు సరికొత్త వినోదాన్ని ఆశించవచ్చు. ఈ క్రేజీయెస్ట్ కాంబినేషన్ కుదిరిన సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.


