|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళ సినిమా పాటలపై అనురాగ్‌ కశ్యప్‌ విమర్శలు.. మణిరత్నం దిమ్మతిరిగే కౌంటర్‌

Published: 28-05-2025, 1:45 PM
తమిళ సినిమా పాటలపై అనురాగ్‌ కశ్యప్‌ విమర్శలు.. మణిరత్నం దిమ్మతిరిగే కౌంటర్‌

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమిళ సినిమా పాటలపై విమర్శలు చేయగా, దానికి మణిరత్నం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తమిళ సినిమా పాటలకు, భాషకున్న ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

Key Points

1

అనురాగ్ కశ్యప్ తమిళ సినిమా పాటల్లో ఇంగ్లీష్ పదాల వాడకంపై విమర్శలు చేశారు.

2

మణిరత్నం అనురాగ్ కశ్యప్ విమర్శలకు చక్కని కౌంటర్ ఇచ్చారు.

4

సినిమా విజయానికి మంచి కథ, పాత్రలు ముఖ్యమని మణిరత్నం అభిప్రాయపడ్డారు.

అనురాగ్ కశ్యప్ విమర్శలు

తమిళ సినిమాల్లో  కథలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అలాగే పాటలకూ అంతే ప్రయారిటీ ఉంటుంది. పాటల కోసమే చాలా సినిమాలు ఆడేవి. 50 ఏళ్ల క్రితం పాటలు ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో ఉంటాయి.

మూడు గంటల సినిమాలో చెప్పలేని విషయాన్ని మూడు నిమిషాల పాటలో చెప్పగలిగే ప్రతిభ తమిళ గీత రచయితలకు ఉండేది. అందుకే పాత పాటలు ఇప్పటికీ మనసు దోచుకుంటున్నాయి.

కానీ ఇప్పుడు పాటలు, వాటి సాహిత్యం చాలా మందికి అర్థం కావడం లేదు. ఇంగ్లీష్ వంటి ఇతర భాషల పదాలు పాటల అందాన్ని పాడు చేస్తున్నాయి. దీని గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, ఇప్పుడు తమిళ పాటల్లో తమిళం వినిపించడం లేదని,

మణిరత్నం కౌంటర్

ఒకప్పుడు తమిళ పాటలను హిందీలోకి అనువదించుకునే వారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, తమిళ పాటలు ఇంగ్లీష్‌ పదాలతో అర్థరహితంగా తయారవుతున్నాయని విమర్శించారు.

దీనికి స్పందిస్తూ మణిరత్నం, “నా చాలా సినిమాల పేర్లు తమిళంలోనే ఉంటాయి. నాకు తమిళం అంటే చాలా ఇష్టం. నేను, రెహమాన్ తమిళ సాహిత్యం నుంచి చాలా కవితలను పాటలుగా మార్చాం. యువతరం కోసం ఇంగ్లీష్‌ పదాలు వాడుతున్నామని నేను అనుకోను.

‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్

అది మాత్రమే సినిమాను హిట్ చేయదు. మంచి కథ, పాత్రలు ఉంటేనే సినిమా ఆడుతుంది. పాటలో, టైటిల్‌లో ఏమున్నా సినిమా ఆడాలంటే మంచి కథ ఉండాలి` అని అనురాగ్‌ కశ్యప్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మణిరత్నం ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా `థగ్‌ లైఫ్‌` చిత్రాన్ని రూపొందించారు. శింబు, త్రిష, అభిరామి, నాజర్‌, తనికెళ్ల భరణి, అశోక్‌ సెల్వరాజ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్‌ 5న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనురాగ్‌ కశ్యప్‌ కామెంట్లపై మణిరత్నం స్పందించి, అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు.

మణిరత్నం తన కౌంటర్‌తో తమిళ సినిమా పాటల ప్రాముఖ్యతను, కథావస్తువు ప్రాధాన్యాన్ని ఎలివేటర్ చేశారు. ఈ వివాదం తమిళ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.