
📌 Key Points
- నాగార్జున ‘సూపర్’ సినిమాతో అనుష్కను హీరోయిన్ గా పరిచయం చేశారు.
- ‘అరుంధతి’ చిత్రంతో అనుష్క బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్‌డమ్ పొందింది.
- నాగార్జునకు 30 ఏళ్లుగా మేకప్ మ్యాన్‌గా ఉన్న రామచంద్రరావు ‘పంచాక్షరి’ చిత్రాన్ని నిర్మించారు.
- నిర్మాత రామచంద్రరావు జీవితం జాగ్రత్తగా చూడాలంటూ నాగార్జున డైరెక్టర్ V. సముద్రకు గోవాలో వార్నింగ్ ఇచ్చారు.
అనుష్క శెట్టి నటించిన ‘పంచాక్షరి’ సినిమా వెనుక ఆసక్తికర కథ దాగి ఉంది. నాగార్జున మేకప్ మ్యాన్‌గా 30 ఏళ్లు పని చేసిన రామచంద్రరావు ఈ చిత్రానికి నిర్మాత. అయితే, సినిమా ప్రారంభానికి ముందు నాగార్జున డైరెక్టర్‌కు గోవాలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
అనుష్క కెరీర్: సూపర్ నుండి అరుంధతి వరకు
కింగ్ నాగార్జున అనుష్క శెట్టిని తన సూపర్ మూవీతో హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆ మూవీలో అనుష్క గ్లామరస్ పాత్రలో అదరగొట్టింది. తొలి చిత్రంతోనే అనుష్కకి మంచి గుర్తింపు లభించింది. దీనితో స్టార్ హీరోల చిత్రాల్లో అనుష్కకి అవకాశాలు ప్రారంభం అయ్యాయి. కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించడం ప్రారంభించింది.
ఆమె నటించిన అరుంధతి చిత్రం తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ వచ్చింది. అరుంధతి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనుష్కతో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అరుంధతి తర్వాత అనుష్క కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పంచాక్షరి అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించింది.
నాగార్జున మేకప్ మ్యాన్ నిర్మించిన సినిమా
ఈ చిత్రానికి దర్శకుడు వి సముద్ర దర్శకుడు. ఈ చిత్రానికి నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు. ఆయన ఎవరో కాదు.. కెరీర్ బిగినింగ్ నుంచి కింగ్ నాగార్జునకి మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లకు పైగా నాగార్జునకి రామచంద్ర రావు మేకప్ మ్యాన్ గా పనిచేశారు. పంచాక్షరి సినిమా ప్రారంభం అయ్యాక నాగార్జున డైరెక్టర్ వి సముద్రని పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట.
ఆ సమయంలో నాగార్జున కేడి మూవీ షూటింగ్ లో గోవాలో ఉన్నారు. సముద్రని ఇక్కడకి తీసుకురా అని నాగార్జున రామచంద్రరావు కి చెప్పారట. దీనితో రామచంద్ర రావు.. వి సముద్రని గోవా తీసుకెళ్లారు. నాగార్జునని కలిశారు. నాగార్జున.. వి సముద్రతో మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి తీశారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్.
గోవాలో నాగార్జున స్వీట్ వార్నింగ్
ఇక్కడ ఉన్నది రామచంద్రరావు.. నా మేకప్ మ్యాన్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంత పెద్ద నిర్మాత కాదు. సో రామచంద్రరావు లైఫ్ జాగ్రత్త. బడ్జెట్ ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాని జాగ్రత్తగా తీయాలి అని నాగార్జున స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి పంచాక్షరి చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
మొత్తానికి, నాగార్జున ఇచ్చిన వార్నింగ్ వెనుక మేకప్ మ్యాన్ పై ఆయనకున్న అభిమానం స్పష్టమవుతోంది. అయితే, ‘పంచాక్షరి’ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది.


