|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్లి గురించి రూమర్లపై అనుష్క ఫైర్! ఏజ్ షేమింగ్‌పై సీరియస్ వార్నింగ్!!

Published: 19-03-2026, 8:35 AM
షాకింగ్: పెళ్లి గురించి రూమర్లపై అనుష్క ఫైర్! ఏజ్ షేమింగ్‌పై సీరియస్ వార్నింగ్!!
  • అనుష్క పెళ్లి రూమర్లపై సీరియస్ యాక్షన్! వయసు గురించి కామెంట్స్ చేస్తే అంతేనని హెచ్చరిక!!
  • బెంగళూరు వ్యాపారవేత్తతో అనుష్క వివాహంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన టీమ్.
  • వ్యక్తిగత విషయాలపై పుకార్లు సృష్టిస్తే సహించేది లేదని అనుష్క టీమ్ హెచ్చరిక!
  • వయసు గురించి మాట్లాడేవారికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన అనుష్క టీమ్.

అనుష్క శెట్టి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై ఆమె టీమ్ ఘాటుగా స్పందించింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అనుష్క పెళ్లిపై వస్తున్న రూమర్స్ ఏమిటి?

అనుష్క శెట్టి పాన్ ఇండియా వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల అనుష్క శెట్టి సినిమాల వేగం తగ్గించింది. అప్పుడప్పుడూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం చేస్తోంది. అయితే అనుష్క గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఆమె పెళ్లి గురించి కూడా నెటిజన్లు మాట్లాడుకుంటారు. ఆమె వయసు ప్రస్తుతం 44 ఏళ్ళు. దీనితో అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని నెటిజన్లు ఆసక్తికరా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి ఎలాంటి రూమర్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అనుష్క బెంగుళూరుకి చెందిన ఓ వ్యాపార వేత్తని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. దీనితో అనుష్క వయసు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ రూమర్స్ పై అనుష్క తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

వయసు గురించి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదా?

ఆ రూమర్స్ ని ఖండిస్తూ తాజాగా అనుష్క శెట్టి టీం క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత గోప్యతని ఎవరూ భంగం కలిగించకూడదు. నిర్ధారించుకోకుండా పుకార్లు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా అనుష్క వయసుని గుర్తు చేస్తూ అవమానకరమైన కథనాలు రాస్తున్నారు అంటూ ఆమె టీం మండిపడింది.

ప్రతిసారి అనుష్క వయసు 44 ఏళ్ళు అని గుర్తు చేస్తూ కథనాలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రతిసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏజ్ షేమింగ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ ? వయసు అంత పెద్ద విషయం అయితే హీరోల విషయంలో కూడా ఇలాగే ఎందుకు ప్రశ్నించరు అని అనుష్క టీం చురకలంటించింది.

అనుష్క టీమ్ వార్నింగ్ వెనుక అసలు కారణం?

అనుష్క ఎంతో కష్టపడి తన కెరీర్ ని నిర్మించుకుంది. ఎప్పుడూ పీఆర్ జిమ్ముక్కులు ప్రదర్శించలేదు. తన వ్యక్తిగత విషయాన్ని ప్రైవేట్ గానే ఉంచుకుంది. పబ్లిసిటీ కోసం పాకులాడలేదు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలి అని అనుష్క టీం పేర్కొంది.

అనుష్క పెళ్లి రూమర్స్‌పై ఆమె టీమ్ సీరియస్ అయింది. వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాప్తి చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.