|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

anushkasharma: కుమార్తె వామిక విరాట్ కోహ్లీకి క్యూట్ విష్.. నెట్టింట వైరలవుతోన్న అనుష్క పోస్ట్

Published: 15-06-2025, 8:03 AM
anushkasharma: కుమార్తె వామిక విరాట్ కోహ్లీకి క్యూట్ విష్.. నెట్టింట వైరలవుతోన్న అనుష్క పోస్ట్

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన కుటుంబంతో కలిసి ఫాదర్స్ డే జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆమె కూతురు వామిక విరాట్ కోహ్లీకి రాసిన క్యూట్ విష్ ప్రత్యేక ఆకర్షణ.

Key Points

1

అనుష్క శర్మ ఫాదర్స్ డే సందర్భంగా క్యూట్ పోస్ట్ పెట్టారు.

2

కుమార్తె వామిక విరాట్ కోహ్లీకి ఫాదర్స్ డే విషెస్ రాసింది.

4

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అనుష్క శర్మ ఫాదర్స్ డే పోస్ట్

బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో అనుష్క శర్మ ఒకరు. ఈ నటి అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక సినిమాల్లో నటించే క్రమంలోనే అనుష్క శర్మ.. ప్రముఖ భారత క్రికెటర్ అయిన విరాట్ కోహ్లితో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. వివాహనంతరం నటి అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పింది. భర్తకు మద్దతుగా నిలుస్తూ.. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉత్తమ భార్యగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది. అనుష్క తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఈ నటి సోషల్ మీడియా వేదికన ఫాదర్స్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను ప్రేమించిన మొదటి వ్యక్తికి, మా కూతురు ప్రేమించిన మొదటి వ్యక్తికి.. ప్రతిచోటా ఉన్న అందమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’’ అని తన నాన్న ఫొటో పంచుకుని క్యూట్ విష్ చేసింది. అలాగే తన పాప విరాట్‌కు బుక్ పై రాసి విష్ చేసినది కూడా పంచుకుంది. instagram lilnk

వామిక విరాట్ కోహ్లీకి విషెస్

నెట్టింట వైరల్

అనుష్క శర్మ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ క్యూట్ ఫాదర్స్ డే పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.