
📌 Key Points
- AP EAPCET 2026 పరీక్షలు ముగిశాయి; 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
- మే 23న ప్రాథమిక కీ విడుదల, మే 25 వరకు అభ్యంతరాల స్వీకరణ.
- జూన్ 1న AP EAPCET 2026 ఫలితాలు అధికారికంగా విడుదల.
- సీట్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల.
ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన AP EAPCET 2026 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు రాశారు. పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన తేదీలు ఖరారయ్యాయి.
ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ
AP EAPCET Results 2026 : ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET) 2026 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి అందించిన గణాంకాల ప్రకారం….. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది పరీక్ష రాశారు. అంటే మొత్తం 92.60 శాతం హాజరు నమోదైంది.
పరీక్షలు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల కోసం అన్ని సెషన్ల పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల ‘కీ’ని ఈ నెల 23న (మే 23) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే, వాటిని మే 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ ప్రాథమిక కీ లను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫలితాల విడుదల, కౌన్సెలింగ్ షెడ్యూల్
అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసిన అనంతరం, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి తుది కీని సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీన ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలను (Results) అధికారికంగా విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫలితాలను కూడా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే…. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.
హాజరు శాతం, ముఖ్యమైన తేదీలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
AP EAPCET 2026 ఫలితాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకం. అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం పరిశీలిస్తూ, ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడం ద్వారా విద్యార్థులు తమ ప్రవేశ ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు.


