|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెట్రోల్ భారం ఇక చరిత్రేనా? రూ.60కే లీటర్ ఇంధనం.. మారుతి సంచలనం!

Published: 04-06-2026, 4:31 AM
పెట్రోల్ భారం ఇక చరిత్రేనా? రూ.60కే లీటర్ ఇంధనం.. మారుతి సంచలనం!
  • మారుతి సుజుకి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ఆవిష్కరించింది.
  • ఈ వాహనం 100% ఇథనాల్ (E100)తో నడుస్తుంది, పెట్రోల్ ధరల భారం తగ్గుతుంది.
  • ఇంధన దిగుమతులు తగ్గి, భారతీయ రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.
  • కాలుష్య ఉద్గారాలు 79% వరకు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి సరికొత్త విప్లవానికి తెరలేపింది. దేశంలోనే తొలి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది పెట్రోల్ భారాన్ని తగ్గించి, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్: భవిష్యత్ ఇంధన విప్లవం

భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేచింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ‘మారుతి సుజుకీ (Maruti Suzuki) భారతదేశపు మొట్టమొదటి మాస్- మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) ప్రయాణికుల వాహనాన్ని ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి (జూన్ 5) ముందే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగింది. ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సాధారణ కార్లు కేవలం పెట్రోల్ లేదా డీజిల్‌తో నడుస్తాయి. కానీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లోని అంతర్గత దహన ఇంజిన్ (Internal Combustion Engine) పెట్రోల్, ఇథనాల్ లేదా ఈ రెండింట్ మిశ్రమంతోనైనా నడవగలదు. ప్రస్తుతం భారతీయ రోడ్లపై ఉన్న కార్లు 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)కు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. కానీ మారుతి సుజుకి తీసుకువచ్చిన ఈ కొత్త సాంకేతికత ఏకంగా 100 శాతం స్వచ్ఛమైనే ఇథనాల్ (E1O0) ఇంధనంతో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. మారుతి సుజుకీ తన పాపులర్ మోడల్స్ అయిన వ్యాగన్-ఆర్ (WagonR) లేదా ఫ్రాంక్స్ (Frenx)లలో ఈ ప్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువ పన్ను కంపెనీ ప్రదర్శించింది.

పెట్రోల్ భారం తగ్గుతుందా? రైతులకు లాభమా?

ఈ వాహనం యొక్క అధికారిక ధర, మైలేజ్ వివరాలను కంపెనీ పూర్తిగా వెల్లడించనప్పటికీ, ఇది సాధారణ పెట్రోల్ మోడల్స్ కంటే స్వల్పంగా ఎక్కువ ధరతో (సుమారు రూ. 8.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధర అంచనా) మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇథనాల్ ధర పెట్రోల్ కంటే చాలా తక్కువ కాబట్టి వినియోగదారులకు ఇంధన ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఇథనాల్ అనేది పెట్రోల్ కంటే భిన్నమైన రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరాల ప్రకారం.. భారతదేశానికి అవసరమైన ఇంధనంలో దాదాపు 87 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల వల్ల దేశానికి మూడు పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ఇథనాల్‌ను చెరకు పిప్పి, మొక్కజొన్న, విరిగిన బియ్యం, వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేస్తారు. దీనివల్ల మనం ఇంధనంపై పెట్టే ఖర్చు విదేశీ ఆయిల్ కంపెనీలకు కాకుండా నేరుగా భారతీయ రైతులకు చేరుతుంది. పెట్రోల్‌తో పోలిస్తే 100% ఇథనాల్లో నడిచే కార్లు టెయిల్ పైప్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను (GHG Emissions) దాదాపు 79 శాతం వరకు తగ్గిస్తాయి. ఇక విదేశీ ఇంధన దిగుమతులు తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది.

గడ్కరీ విజన్: ఇంధన స్వయం సమృద్ధి

టెక్నాలజీ పరంగా మారుతి సుజుకీ సిద్ధంగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఇథనాల్ లభ్యత పెరగాల్సి ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 5,000 E100 (100% ఇథనాల్) ఫ్యూయల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మారుతి సుజుకీ అడుగుజాడల్లో రాబోయే రోజుల్లో టాటా మోటార్స్, మహీంద్రా, టయోటా కంపెనీలు కూడా తమ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను భారీగా మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ముందడుగు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు, పర్యావరణానికి మేలు చేసే గొప్ప మార్పు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.