|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీ ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడెను! విడుదల ఎప్పుడో తెలుసా?

Published: 07-04-2026, 8:35 PM
ఏపీ ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ వీడెను! విడుదల ఎప్పుడో తెలుసా?
  • ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదల కానున్నాయి.
  • విద్యార్థులు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
  • కోర్సులోని రెగ్యూలర్ సబ్జెక్టుల ఫలితాలను బోర్డు ప్రామాణికంగా తీసుకుంటుంది.
  • ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

ఫలితాల విడుదల తేదీ ఖరారు?

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. విడతల వారీగా మూల్యాంకనం జరుగుతుండగా…. ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

ఈసారి ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో రావొచ్చు. ఏప్రిల్ 16 నుంచి 19 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రాథమికంగా తేదీలను ఖరారు చేసుకోగా…. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

అదనపు సబ్జెక్టుల ఫలితాల ప్రకటన ఎలా?

ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు…గ్రూప్ సబ్జెక్టులతో పాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంచుకున్నారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ తో పాటు ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. కోర్సులోని రెగ్యూలర్ సబ్జెక్ట్ ఫలితాలనే బోర్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. వీటి ఫలితాలను సాధారణంగానే ప్రకటించనుంది. అయితే ఆప్షన్ గా ఎంచుకున్న సబ్జెక్ట్ రాత పరీక్ష ఫలితాలను మాత్రం ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచడం లేదా కాలేజీలకు పంపిస్తారని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకునే విధానం

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆసక్తి నెలకొంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది ముఖ్యమైన సమాచారం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.