
📌 Key Points
- ఆంధ్రప్రదేశ్ ఐటీఐ అడ్మిషన్ల నోటిఫికేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల.
- పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు శుభవార్త అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఐటీఐ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం.
ఐటీఐ అడ్మిషన్లు: ముఖ్య వివరాలు
పదో తరగతి పూర్తి చేసుకుని టెక్నికల్ కోర్సుల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలలో (ITIs) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ గుమ్మల గణేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆగస్ట్ 2026 నుండి ప్రారంభం కానున్న ఈ విద్యా సంవత్సరంలో ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలపరిమితి గల ఎన్‌సీవీటీ(NCVT), ఎస్‌సీవీటీ(SCVT) నమూనా వివిధ ఇంజనీరింగ్, నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్నారు.
దరఖాస్తు విధానం, చివరి తేదీ
ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, టర్నర్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ (COPA) వంటి ఎన్నో డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ ట్రేడ్‌లలో విద్యార్థులు శిక్షణ పొందవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి రైల్వేస్, ఆర్టీసీ, విద్యుత్ శాఖ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే స్వయం ఉపాధి పొందేందుకు కూడా ఇవి ఎంతో దోహదపడతాయి.
కోర్సులు, ఉద్యోగ అవకాశాలు
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ iti.ap.gov.in సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ, కౌన్సిలింగ్, సీట్ల కేటాయింపు, ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తమ సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని డైరెక్టర్ గుమ్మల గణేష్ కుమార్ తమ ప్రకటనలో సూచించారు. జూన్ 30 చివరి తేదీ కావున గడువు ముగిసేలోపు విద్యార్థులు అప్లై చేసుకోవాలని తెలిపారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ ఐటీఐ కోర్సులు విద్యార్థులకు కేవలం ఉద్యోగ అవకాశాలనే కాకుండా, స్వయం ఉపాధి పొందేందుకు కూడా దోహదపడతాయి. అర్హులైన విద్యార్థులు చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


