
📌 Key Points
- ఏపీ లాసెట్ 2026 దరఖాస్తు గడువును పొడిగించిన ఉన్నత విద్యామండలి.
- ఫైన్ లేకుండా మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం.
- మే 4న ఏపీ లాసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ.
- మూడేళ్ల, ఐదేళ్ల లా, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం.
ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2026 దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మార్చి 20 వరకు ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మే 4న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దరఖాస్తు గడువు పొడిగింపు వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ లాసెట్) 2026 దరఖాస్తు గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఫిబ్రవరి 12వ తేదీన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మెుదలైన విషయం తెలిసిందే. మార్చి 12వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా మెుదట నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దానిని మార్చి 20వ తేదీ వరకు పొడిగంచారు.
ముఖ్యమైన తేదీలు
ఏపీ లాసెట్ – 2026 పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి మూడేళ్ల లా, ఐదేళ్ల లా, పీజీ లా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్ధులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్ ప్రవేశ పరీక్ష మే 4వ తేదీన జరుగుతుంది. కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు లా డిగ్రీ ఉండాలి.
దరఖాస్తు విధానం
ఏపీ లాసెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అప్లికేషన్ ఫీజు ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు చెల్లింపు వివరాల ఆధారంగా అప్లికేషన్ ఫారమ్ లింక్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థి ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేస్తే ఏపీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
ఏపీ లాసెట్ 2026 దరఖాస్తు గడువు పెంపుతో విద్యార్థులకు మరింత సమయం లభించింది. సద్వినియోగం చేసుకొని పరీక్షకు సిద్ధం కండి. మే 4న పరీక్ష జరుగుతుంది.


