|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు!

Published: 22-03-2026, 9:35 PM
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు!
  • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • ఉత్తర కోస్తా, యానాంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
  • ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
  • మార్చి 24, 25 తేదీల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.

ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో రానున్న వర్షాలు

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతల నమోదులో కూడా చాలా తేడాలుంటున్నాయి.

రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

ఇవాళ (23-03-26)​ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ​ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.రుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది.

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

మరోవైపు తెలంగాణకు వాతావరాణశాఖ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల దాటికి… పంట నష్టం వాటిల్లింది. కమార్చి 24,25 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇక మార్చి 26వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వేసవి వేళ అకాల వర్షాలు పడుతుండగా…. వాతావరణం చల్లగా ఉంటోంది.

అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వేచి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.