
📌 Key Points
- తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.
- ఉత్తర, దక్షిణ కర్ణాటక మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
- ఏపీలో అల్లూరి, నెల్లూరు, కడప సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ప్రజలు పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో వర్ష సూచన, హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండగా… మరికొన్నిచోట్ల తేలికపాటి వానలు కురుస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితులు మరికొన్ని రోజుల పాటు ఉండే సూచనలున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను పేర్కొంది.
నిన్నటి ఉత్తర అంతర కర్ణాటక నుంచి…. దక్షిణ అంతర కర్ణాటక మరియు అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది.
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్న వివరాల ప్రకారం…. తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలు పడొచ్చు. ఎల్లుండి కూడా ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మార్చి 21వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ప్రజలకు విపత్తుల సంస్థ హెచ్చరిక
మరోవైపు ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. బుధవారం(18-03-26) అల్లూరి, పోలవరం,నెల్లూరు,కడప,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…. చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది.
మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.


