|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏప్రిల్ ఫస్ట్ వీక్ మూవీ ట్రీట్: థియేటర్లలో సందడి చేసే చిత్రాలు!

Published: 30-03-2026, 7:35 AM
ఏప్రిల్ ఫస్ట్ వీక్ మూవీ ట్రీట్: థియేటర్లలో సందడి చేసే చిత్రాలు!
  • ఏప్రిల్ మొదటి వారంలో రాకాస చిత్రం విడుదల కానుంది, ఇది ఒక ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా.
  • శర్వానంద్ నటించిన ‘బైకర్’ చిత్రం ఇండియన్ ఫస్ట్ మోటో క్రాస్ ఫిలిం గా ఏప్రిల్ 3న విడుదల కానుంది.
  • కార్మేనీ సెల్వమ్ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
  • శర్వానంద్ ‘బైకర్’ సినిమా కోసం 22 కేజీల బరువు తగ్గి, ప్రతిరోజు 11 కిలోమీటర్లు పరిగెత్తారు.

వేసవిలో విడుదల కానున్న పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. కామెడీ, హారర్, యాక్షన్, స్పోర్ట్స్ వంటి వివిధ జానర్లలో సినిమాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్నాయి.

ఏప్రిల్ లో విడుదల కాబోయే సినిమాలు

Summer Movies:ఏప్రిల్ అనగానే మండే ఎండలు.. కారే చెమటలు. అంతకుమించి ఇంకేముంటుంది అనేవారు లేకపోలేదు..కానీ ఈ హాట్ సమ్మర్ లో కూడా మిమ్మల్ని కూల్ చేసి ఎంటర్టైన్ చేయడానికి కొన్ని చిత్రాలు సిద్ధమవుతున్నాయి. భిన్న విభిన్నమైన జానర్లలో కామెడీని మొదలుకొని హారర్, యాక్షన్, స్పోర్ట్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వరకు ఎన్నో చిత్రాలు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ హాట్ సమ్మర్లో మిమ్మల్ని కూల్ చేయడానికి ఏప్రిల్ మొదటి వారంలోనే రాబోతున్న ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాకాస. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ ఫిక్షనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఓ చందమామ కథలా ఉంటుంది అంటోంది రాకాస చిత్ర బృందం. మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ , సారిక జంటగా రూపొందిన చిత్రం ఇది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘బైకర్’ సినిమా కోసం శర్వానంద్ కష్టం

ఇండియన్ ఫస్ట్ మోటో క్రాస్ ఫిలిం గా రాబోతున్న చిత్రం బైకర్. ఇప్పటివరకు ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇలాంటి సినిమా తీయలేదు.. చూడలేదు.. అంటున్నారు హీరో శర్వానంద్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా పేరు సొంతం చేసుకున్న శర్వానంద్ తాజాగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ఇది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఇప్పటివరకు చూడని సరికొత్త స్పోర్ట్స్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ దాదాపు రెండు సంవత్సరాలలో 22 కేజీల బరువు తగ్గారు. ప్రతిరోజు ఆగకుండా 11 కిలోమీటర్లు పరిగెత్తేవారట. ఇక శర్వానంద్ కష్టానికి ఈ సినిమా గట్టి ఫలితాన్ని ఇస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సముద్రఖని , లక్ష్మీ ప్రియా, అభినయ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం కార్మేనీ సెల్వమ్. ఏప్రిల్ 3వ తేదీన తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ కుమార్, కరణ్ చక్రవర్తి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దినట్లు సమాచారం.

‘రాకాస’, ‘కార్మేనీ సెల్వమ్’ చిత్రాల విడుదల

ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ లెజెండ్ సినిమాతో నటుడిగా మారి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అలా లెజెండ్ శరవణన్ గా పేరు దక్కించుకున్న ఈయన ప్రస్తుతం లీడర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంటుతో యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతోంది.

ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న ఈ చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని ఆశిద్దాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమాలు రూపొందుతున్నాయని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.