|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెహమాన్ సంచలనం: నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి! వివాదంపై దిమ్మతిరిగే ట్విస్ట్!!

Published: 18-01-2026, 3:00 AM
రెహమాన్ సంచలనం: నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి! వివాదంపై దిమ్మతిరిగే ట్విస్ట్!!
  • రెహమాన్ సంచలన వ్యాఖ్యలు: బాలీవుడ్‌లో విభజన ధోరణులు పెరిగాయని ఆరోపణ!
  • ఎనిమిదేళ్లుగా త‌గ్గిన అవ‌కాశాలు: సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి పవర్ చేరిందన్న రెహమాన్.
  • వివాదాస్పద ‘ఛావా’ సినిమా: సంగీతంపై రెహమాన్ చేసిన కామెంట్స్‌పై దేశ ప్రజల ఆగ్రహం!
  • భారతదేశమే నా స్ఫూర్తి: వివాదాలకు వివరణ ఇస్తూ వీడియో విడుదల చేసిన రెహమాన్!

సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రెహమాన్ ఏం మాట్లాడారు, ఎందుకు వివాదం రేగింది?

బాలీవుడ్‌లో విభజన ధోరణులు: రెహమాన్ సంచలన ఆరోపణలు

AR Rahman: బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విభజనపరమైన ధోరణులు పెరిగాయంటూ ఏఆర్ రెహమాన్‌ సంచలన కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. దాదాపు ఎనిమిదేళ్లుగా నాకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం సృజనాత్మకత లేని వ్యక్తులు చేతుల్లోకి పవర్ వెళ్ళింది. దీనికి, మతపరమైన అంశం కారణం కావచ్చ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

అలాగే ‘ఛావా’ సినిమాకు మ్యూజిక్ చేయడంపై కూడా ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అయితే, రెహమాన్(AR Rahman) చేసిన ఈ కామెంట్స్ పై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రెహమాన్ కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను చేసిన కామెంట్స్ పై వివరణను ఇస్తూ వీడియో విడుదల చేశాడు రెహమాన్.

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన రెహమాన్

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “భారతదేశమే నా స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. సంగీతం ఎప్పుడూ భారతీయ సంస్కృతితో అనుసంధానించే మార్గంగానే ఉంది. కొన్నిసార్లు నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ, నా ఉద్దేశ్యం ఎప్పుడూ దేశాన్ని గౌరవించడం, సేవ చేయడం మాత్రమే. ఏ ఒక్కరినో బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. నా నిజాయితీని గుర్తిస్తారని అందరూ గుర్తిస్తారని కోరుకుంటున్నాను.

భారతదేశమే నా స్ఫూర్తి: వీడియో విడుదల చేసిన రెహమాన్

నా భారతదేశం బహుళ సంస్కృతులను ప్రోత్సహిస్తుంది. ప్రధానమంత్రి ఝాలా, నాగాలాండ్ సంగీతకారులతో కలిసి పనిచేయడం, మల్టీకల్చరల్ వర్చువల్ బ్యాండ్ ‘సీక్రెట్ మౌంటైన్’ చేశాను. ప్రస్తుతం హన్స్ జిమ్మర్‌తో కలిసి ‘రామాయణం’ సినిమాకు సంగీతం అందిస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా”అంటూ చెప్పుకొచ్చాడు రెహమాన్. దీంతో ఆయన చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెహమాన్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన స్పందనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదం మరింత ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.