
📌 Key Points
- అర్జిత్ సింగ్ ఒక్కో పాటకు రూ.10-20 లక్షల వరకు తీసుకుంటారని సమాచారం.
- ప్రైవేట్ షోలో పాల్గొనడానికి అర్జిత్ సింగ్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు.
- లైవ్ కన్సర్ట్ చేస్తే అర్జిత్ సింగ్ పారితోషికం 12-14 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
- అర్జిత్ సింగ్ సుమారు 400 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్కో పాటకు, లైవ్ కన్సర్ట్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా? ఆయన ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్జిత్ సింగ్ రెమ్యూనరేషన్ వివరాలు
Arijit Singh: అర్జిత్ సింగ్ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఉన్నఫలంగా తన రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అర్జిత్ (Arijith)ఉన్నఫలంగా ఇలా ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన రిటైర్మెంట్ పై ఎంతోమంది సింగర్లు సంగీత దర్శకులు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇలా మంచి టాలెంటెడ్ సింగర్ ఇండస్ట్రీకి దూరం అవ్వడం అనేది బాధాకరమని చెప్పాలి.
సింగర్ అర్జిత్ ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈయనకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పటికే ఎన్నో లైవ్ కన్ఫర్ట్ చేశారు. ఒక్కో పాటకు ఈయన ఎంత తీసుకుంటారు? లైవ్ కన్సర్ట్ చేస్తే రెమ్యూనరేషన్ ఎంత? ఈయన ఆస్తిపాస్తులు గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా సమాచారం ప్రకారం అర్జిత్ వివిధ భాషలలో ఇప్పటివరకు సుమారు 400 కు పైగా పాటలు పాడారని తెలుస్తోంది.. ఈయన ఒక్కో పాటకు పది నుంచి 20 లక్షల రూపాయల రెమ్యూనరషన్ అందుకు అంటున్నారు. ఇక అర్జిత్ ఏదైనా ఒక ప్రైవేట్ షోలో అటెండ్ అవ్వాలి అంటే సుమారు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాల్సిందే.
లైవ్ కన్సర్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తారు?
ఇక ఈయన ఒక లైవ్ కన్సర్ట్ కనుక నిర్వహిస్తే సుమారు 12 నుంచి 14 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారంటూ పలువురు సంగీత దర్శకులు, ఇతర సింగర్లు ఈ విషయాన్ని పలు సందర్భాలలో తెలియచేశారు. ఇక ఈయన ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయానికి వస్తే.. అర్జిత్ ఇప్పటివరకు సుమారు 400 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారని తెలుస్తోంది. ఇలా వందల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఒక సాధారణ వ్యక్తి లాగే కనిపిస్తూ ఉంటారు. ఇక అర్జిత్ కేవలం పాటల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్, ఓరియన్ మ్యూజిక్ స్టూడియోస్ ద్వార కూడా భారీగా సంపాదిస్తున్నారు.
రిటైర్మెంట్ కు కారణం ఏంటి?
అర్జిత్ సింగ్ ఆస్తుల విలువ ఎంత?
ఇలా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా కొనసాగుతున్న అర్జిత్ ఉన్నఫలంగా తన రిటైర్మెంట్ విషయం మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి ఈయన ఉన్నఫలంగా రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ విషయంపై అర్జిత్ స్పందించాల్సి ఉంది. ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఉయ్యాల జంపాల మనం వంటి సినిమాలలో పాటలను పాడిన సంగతి తెలిసిందే.
మొత్తానికి, అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ వార్త అభిమానులను నిరాశపరిచినా, ఆయన సంపాదన, ఆస్తుల గురించి చర్చనీయాంశంగా మారింది. ఆయన తిరిగి వస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


