|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంగీత ప్రపంచానికి షాక్: అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం! గుడ్ బై చెప్పడానికి కారణం ఇదేనా?

Published: 27-01-2026, 1:05 PM
సంగీత ప్రపంచానికి షాక్: అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం! గుడ్ బై చెప్పడానికి కారణం ఇదేనా?
  • అర్జిత్ సింగ్ తన రిటైర్మెంట్ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
  • ఆయన రిటైర్మెంట్ కారణాలను వెల్లడించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.
  • అర్జిత్ సింగ్ ఆషీకీ 2 సినిమాలోని ‘తుమ్ హి హూ’ పాటతో ఎంతో గుర్తింపు పొందారు.
  • తెలుగులో మనం, ఉయ్యాల జంపాల వంటి సినిమాల్లో ఆయన పాటలు పాడారు.

బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన వీడ్కోలు నిర్ణయంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆయన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటన

Arijit Singh Retirement: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గాయకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అర్జిత్ సింగ్ (Arijit Singh)అభిమానులకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చారు. దాదాపు దశాబ్ద కాలంగా ఈయన ఇండస్ట్రీలో ప్లేబాక్ సింగర్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అర్జిత్ సింగ్ తా సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ లో ఉండిపోయారు. ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. ఇన్ని రోజులపాటు తనపై ఎంతో ప్రేమ ,అభిమానం చూపిన వారందరికీ థాంక్స్ చెప్పారు. ఇప్పటివరకు తన ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని తనను ఆదరించినందుకు ధన్యవాదాలు చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించారు.

ఇండస్ట్రీకి రిటైర్మెంట్ చెప్పిన అర్జీత్ తన రిటైర్మెంట్ కి గల కారణాలను మాత్రం వెల్లడించకపోవడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జిత్ ఇలా ఉన్నఫలంగా రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినప్పటికీ ఇండిపెండెన్స్ సింగర్ గా కొనసాగుతారు అంటూ మరికొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎంతో టాలెంటెడ్ సింగర్ ఇండస్ట్రీకి దూరం కావడం అనేది ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇక అర్జిత్ పాడిన పాటలలో ఆషీకీ 2 సినిమాలోని ‘తుమ్ హి హూ’ అనే పాట ,ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .ఈ పాట తర్వాత ఈయన కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ పాటతో తన కెరియర్ మొత్తం మారిపోయింది.

అభిమానుల దిగ్భ్రాంతి, సందేహాలు

ఇక తెలుగులో కూడా మనం, ఉయ్యాల జంపాల ,స్వామి రారా వంటి సినిమాలకు ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు. ఇలా దశాబ్ద కాలంలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అర్జిత్ సింగ్ ఏకంగా రెండు నేషనల్ అవార్డులను అందుకున్నారు .అలాగే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇలా తన గాత్రంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన అర్జిత్ గొంతు ఇక వినపడదన్న వార్త సంగీత ప్రియులను ఎంతగానో కలవరపెడుతోంది. మరి ఆర్జిత్ ఉన్నఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి ? అనే విషయాలపై ఆర్జిత్ వివరణ ఇవ్వాల్సి ఉంది.

అర్జిత్ సింగ్ కెరీర్ ప్రస్థానం

అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ సంగీత ప్రియులకు తీరని లోటు. ఆయన తిరిగి వచ్చి మరిన్ని పాటలు పాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై అర్జిత్ వివరణ కోసం ఎదురుచూడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.