
📌 Key Points
- అర్జున్ సర్జా దర్శకత్వంలో ‘సీతా పయనం’ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
- ఈ చిత్రంలో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
- విశ్వక్ సేన్ తొలగడానికి గల కారణాలను అర్జున్ సర్జా వివరించారు.
- గతం గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలని అర్జున్ సర్జా తెలిపారు.
అర్జున్ సర్జా దర్శకత్వంలో సీతా పయనం సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలగింపు గురించి అర్జున్ సర్జా స్పందించారు. సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సీతా పయనం సినిమా విశేషాలు
Arjun sarja:అర్జున్ సర్జా పరిచయం అవసరం లేని పేరు. అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు తమిళ, కన్నడ, భాషలలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా సౌత్ సినిమాలలో హీరోగా ఎంతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల ఇండస్ట్రీకి కాస్త దూరమైన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ అర్జున్ సర్జా తిరిగి హీరోగా కాకుండా దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈయన దర్శకత్వంలో సీతా పయనం (Sitapayanam) అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్(Aishwarya arjun) హీరోయిన్ గా నటించబోతున్నారు.
ఈ సినిమాలో ఐశ్వర్య నిరంజన్ జోడీగా నటించగా ,సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. ఈ సినిమా వాలెంటైజ్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో నటుడు అర్జున్ సర్జా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
విశ్వక్ సేన్ తొలగింపుపై అర్జున్ సర్జా క్లారిటీ
ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియచేశారు. నిజానికి ఈ సినిమాలో ముందుగా నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి అయ్యాయి. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకుంటున్నానని చెప్పడంతో అప్పట్లో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. తాజాగా ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురవడంతో అర్జున్ సర్జా మాట్లాడుతూ…
గతం ఆలోచిస్తే భవిష్యత్తు ఉండదు…
గతం గురించి అర్జున్ సర్జా ఏమన్నారంటే?
కొన్ని కారణాల వల్ల కొన్ని విషయాలు జరగవు అయితే మనం వాటిని టిక్ వేసుకొని ఎందుకిలా జరిగింది? ఏంటి? అనే విషయాల గురించి నేను ఆలోచించను నేను ఎప్పుడు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనుకుంటూ ముందుకు వెళుతుంటాను. అలా అనుకోకపోతే మనం మరో అడుగు ముందుకు వేయలేము అందుకే వాటి గురించి ఆలోచించనని అర్జున్ సర్జా తెలిపారు. అబ్బాయి కూడా చాలా మంచోడు తన సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఆయన సినిమాలు మంచిగా సక్సెస్ కావాలి అతనితో మన సినిమాకు వర్క్ అవుట్ అవ్వలేదు అంతకుమించి ఎలాంటి గొడవలు లేవంటూ ఈ సందర్భంగా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తెలపడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక విశ్వక్ కూడా సీతాపయనం సినిమాకు పోటీగా ఫంకీ(Funky) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా కూడా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కావటం విశేషం.
అర్జున్ సర్జా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ‘సీతా పయనం’ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా విజయం సాధించాలని ఆశిద్దాం.


