
📌 Key Points
- ‘అతడు’ చిత్రం గతంలో మహేష్ బాబు పుట్టినరోజున రీ రిలీజ్ అయింది.
- ఈ సినిమా రీ రిలీజ్ హక్కులను 3.2 కోట్లకు కొనుగోలు చేశారు.
- రీ రిలీజ్ లో ఆశించిన స్పందన రాకపోవడంతో బయ్యర్లకు కోటి రూపాయల నష్టం వచ్చింది.
- ఒకసారి రీ రిలీజ్ హక్కులు కొనుగోలు చేస్తే ఏడాది వరకు ఉంటాయి.
మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా మరోసారి రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. గతంలో రీ రిలీజ్ చేసినప్పుడు బయ్యర్లకు నష్టం రావడంతో, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది.
‘అతడు’ సినిమా రీ రిలీజ్ నేపధ్యం
Athadu Movie:ఈమధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రత్యేకమైన రోజులలో.. తమ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను అలాగే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసి నిర్మాతలు లాభపడుతున్న విషయం తెలిసిందే ..ప్రస్తుత కాలంలో ట్రెండు మారింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి. అలా ఒకప్పుడు థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో , టీవీలలోకి వచ్చి సందడి చేస్తుంటే.. అలాంటి చిత్రాలను మళ్లీ 4k వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక సినిమా ఏడాదిలో రెండుసార్లు విడుదల అవుతుండడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ చిత్రం ఏంటి? ఎందుకు మళ్ళీ రీ రిలీజ్ అవుతోంది ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీమోహన్ సమర్పకుడిగా డి. కిషోర్, ఎమ్.రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. 2005లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ టీవీలోకి వచ్చిన తర్వాత మంచి విజయం అందుకుంది. అయితే అలాంటి ఈ సినిమా గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయింది. వాస్తవానికి టెలివిజన్లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన మూవీగా ‘అతడు’ సినిమా మంచు రికార్డు దక్కించుకుంది.. అలాగే ఈ సినిమాకి సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ ఏర్పడడంతో రీ రిలీజ్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని భావించిన బయ్యర్లు భారీ రేటుకు ఈ సినిమా 4కె రీ రిలీజ్ హక్కులు దక్కించుకొని భారీగా విడుదల చేశారు.
బయ్యర్లకు ఎదురైన నష్టం
అలా ఈ సినిమా రైట్స్ రూ.3.2 కోట్ల కొనుగోలు చేయగా.. ఓవరాల్ గా ఈ సినిమా రికవరీ చేయాలి అంటే రూ.3.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే గత ఏడాది ఉన్న సోషల్ మీడియా బజ్ తో సినిమాకి మంచి లాభాలు వస్తాయని బయ్యర్స్ ఆశించారు. కానీ అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదు. రీ రిలీజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో కొన్న ధరకు వర్క్ అవుట్ కాక ఏకంగా కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. దీంతో బయ్యర్లు కూడా నిరాశ వ్యక్తం చేశారు అయితే ఇక్కడ బయ్యర్లకు ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. ఒకసారి రీ రిలీజ్ హక్కులు కొనుగోలు చేస్తే ఏడాది వరకు ఉంటాయి.
మళ్ళీ రీ రిలీజ్ వెనుక వ్యూహం
ఒకవేళ రీ రిలీజ్ లో బయ్యర్లకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని మళ్ళీ పూడ్చుకోవడానికి ఏడాదిలోపు ఆ చిత్రాలను మళ్ళీ రీ రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నమాట. అంటే ఇది బయ్యర్లకు కాంపెన్సేషన్ లాగానే చెప్పుకోవచ్చు. అంటే ఏడాదిలోపు మళ్లీ రిలీజ్ చేసుకోవచ్చన్నమాట. అలా గత ఏడాది రిలీజ్ చేసి నష్టాన్ని చవిచూసిన బయ్యర్లు.. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. అలా ఈనెల 28వ తేదీన ఈ సినిమాను సూపర్ 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేయనన్నారు. మొత్తానికైతే మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న మేకర్స్ కి కనీసం ఇప్పుడైనా లాభం చేకూరుతుందేమో చూడాలి.
మొత్తానికి ‘అతడు’ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుండడం వెనుక బయ్యర్ల ఆశలు, గతంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఈసారి సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


