
📌 Key Points
- పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా మార్చి 19న ప్రారంభం కానుంది.
- జైత్రరామ మూవీస్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం దాదాపు రూ. 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.
- వక్కంతం వంశీ పవన్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమా మార్చి 19న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభం
Pawan Movie: EXCLUSIVE.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ బిజీ షెడ్యూల్ నడుమ కూడా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా ఇప్పుడు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 19, ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నారు. జైత్రరామ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కిక్’, రేసుగుర్రం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఎలా చూసించబోతున్నాడా అని అభిమానులు వేచి చూస్తున్నారు.
Read also- Brahmamudi Serial Today February 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: డాక్టర్ చక్రవర్తిని విడిపించిన రాజ్
భారీ బడ్జెట్‌తో జైత్రరామ మూవీస్ నిర్మాణం
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఆయనకున్న క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ మొత్తం పెద్ద విషయమేమీ కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే, అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను తనదైన మార్కు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ పవన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్, జైత్రరామ మూవీస్ సంయుక్తంగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. గతంలోనే ప్రకటించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్, ఎట్టకేలకు 2026లో ప్రారంభం కానుండటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ వంటి చిత్రాల తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరో మాస్ బొమ్మ ఇదే కావడం విశేషం. ఓజీ తర్వాత పవన్ కళ్యాన్ సినిమాల గురించి అప్డేట్ ఇవ్వలేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే లైన్ లో ఉంది. తాజాగా మరో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడానికి రెడీ గా ఉండటంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత?
Read also- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..
పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులకు వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా 2026లో ప్రారంభం కానుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Zareen Khan Blasts Photographer Over Inappropriate Remark, Video Goes Viral