
📌 Key Points
- చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం థియేటర్లలో విడుదల, పాజిటివ్ టాక్!
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాట వివాదం, పోలీసు కేసుల వరకు దుమారం రేపింది.
- సినిమా చూసిన తర్వాత బోరున ఏడ్చిన చంద్రహాస్, ఎమోషనల్ స్పీచ్ వైరల్.
- మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా, అర్జున్ మహి విలన్‌గా నటించిన ఈ చిత్రం.
యంగ్ హీరో చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం విడుదల సందర్భంగా సంచలనంగా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన వివాదం తరువాత, చంద్రహాస్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. సినిమా ఎలా ఉందో చూద్దాం!
వివాదంలో చిక్కుకున్న చంద్రహాస్
బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్(Chandrahas) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆయన చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ వరుస వివాదాల్లో చిక్కుకుంటూ.. ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఇక ఇటీవల ‘బరాబర్ ప్రేమిస్తా’ ఈవెంట్‌తో బూతు పాటతో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ వివాదం కాస్త.. పోలీసు కేసుల వరకు వెళ్లింది. అయినప్పటికీ చంద్రహాస్ మాత్రం తాను అలాంటి పాట పాడినందుకు బాధపడటం లేదని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని చెప్పడంతో ఈ వివాదం కాస్త ముదిరింది పెద్ద దుమారం రేపుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premista)మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ సినిమాను చిత్రయూనిట్‌తో కలిసి ప్రేక్షకుల మధ్య చూసిన చంద్రహాస్ మీడియాతో మాట్లాడుతూ బోరున ఏడ్చేశాడు. ‘‘బరాబర్ ప్రేమిస్తా’ క్లైమాక్స్ చూశాక నాకు మాటలు రావడం లేదు. చివరి రెండు నిమిషాలు.. రెండు మూడు నెలల క్రితం నేను చూసినప్పుడు మ్యూజిక్ లేకుండా కేవలం రఫ్ కట్ మాత్రమే చూశాను.
ఇప్పుడు వెండితెరపై పూర్తిస్థాయి అవుట్‌పుట్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మూవీ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే.. థియేటర్‌లో అందరూ చప్పట్లు కొట్టారు. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక వివాదం నన్ను చాలా ఆందోళనకు గురిచేసింది. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేను పాడిన పాట కొందమందికి నచ్చుతుందని చేశా. కానీ అది ఇప్పుడు సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని భయమేసింది. సినిమా బాలేకుంటే అలా అయినా ఏం కాకపోతుండే కానీ సినిమా చాలా బాగుంది. ప్రేక్షకులను చూస్తుంటే.. సంతోషంగా అనిపించింది. అలాగే ధైర్యంగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాలో చంద్రహాస్ సరసన మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ మహి విలన్‌గా చేశాడు. సంసత్ రుద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని నిర్మించిన ఈ సినిమా థియేటర్స్‌లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది.
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ రిలీజ్
క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన హీరో
చంద్రహాస్ ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


