
📌 Key Points
- యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ బూతు పాట పాడటంపై జర్నలిస్ట్ అశోక్ కుమార్ ప్రశ్నించారు.
- సినిమా పబ్లిసిటీ కోసం దిగజారడం సరికాదని అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు.
- సోషల్ మీడియాలో చాలా విషయాలపై అశోక్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.
- చంద్రహాస్ తన వ్యాఖ్యలపై 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇటీవల బూతు పాట పాడటం వివాదాస్పదమైంది. జర్నలిస్ట్ అశోక్ కుమార్ దీనిపై తీవ్రంగా స్పందించారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అని ప్రశ్నించారు. దీంతో చంద్రహాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
చంద్రహాస్ బూతు పాటపై దుమారం
Attitude Star: జర్నలిస్ట్‌గా బాధ్యత నెరవేర్చితే, ఇదేంటని ప్రశ్నిస్తే.. క్షమాపణ చెప్పాలట. లేదంటే చట్టపరంగా ముందుకు వెళ్తాడట.. ఇదంతా అంటోంది ఎవరో తెలుసా.. యాటిట్యూడ్ స్టార్ అని చెప్పుకుంటున్న ‘చంద్రహాస్’ (Chandrahass). నిజంగా తన యాటిట్యూడ్‌ని చూపిస్తూ.. తాజాగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తను చేస్తున్న సినిమాపై ఇంపాక్ట్, క్రేజ్, బజ్ తీసుకురావడం కోసం బూతుల పాట పాడానని చెప్తూనే, ‘నన్ను చాలా మంది తిట్టారు. నేను కేవలం బూతు పాట పాడితే ప్రశ్నిస్తారా?, నా జోలికి వస్తే పగిలిపోద్ది’ అంటున్నాడంటే.. ఏ స్థాయిలో యాటిట్యూడ్ ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇది తప్పు, పబ్లిక్‌లో అలాంటి పాటలు పాడటం, సినిమా కోసం ఇంత దిగజారడం ఏంటి? అని బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్ (Journalist Ashok Kumar) సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ విడుదల చేసిన వీడియోకు సమాధానంగా యాటిట్యూడ్ హీరో బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు.
‘పొద్దున్నే నిద్రలేవగానే సోషల్ మీడియాలో ఈ బూతు పాట కనిపించింది .. సినిమా పబ్లిసిటీ కోసం అది కూడా నెగెటివ్ పబ్లిసిటీ కోసం వీళ్ళు చేస్తున్న అరాచకం చూడండి.. ఆ భాషని ఎంకరేజ్ చేద్దామా? ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేద్దామా? ఆలోచించండి..’ అంటూ ఆ బూతు పాట పాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న జెడి చక్రవర్తి, ఇంకా చంద్రహాస్ కుటుంబ సభ్యులు, చిత్ర దర్శకనిర్మాతలకు కాస్త ఘాటుగా తగిలేలా అశోక్ కుమార్ ప్రశ్నించారు. ఆయన ఇప్పుడే కాదు, సోషల్ మీడియాలో చాలా విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఇది తప్పు.. అలాంటివి చేయకండి.. అని అర్థవంతంగా చెబుతుంటారు. ఒక్కటని కాదు, హైదరాబాద్‌లో దొరికే మందుల దగ్గర నుంచి జొమాటో, స్విగ్గీ వంటి వాటి వరకు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, దానిపై ఒక అవగాహన కల్పిస్తుంటారు. అలాంటిది, సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇలాంటి బూతు పదాలతో ఉన్న పాట వినగానే, కచ్చితంగా ఇది సమాజానికి శ్రేయస్కరం కాదని, ఒక వైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయి గుర్తింపును పొందుతుంటే, మరోవైపు ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో ఇండస్ట్రీని నాశనం చేయాలనుకునే వారికి గడ్డి పెట్టాలనిపించడంలో తప్పులేదు. ఒక్క అశోక్ కుమార్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ వీడియోకు తిట్టిన వాళ్లే కానీ, తిట్టని వాళ్లు లేరు.
జర్నలిస్ట్ అశోక్ కుమార్ ప్రశ్నలు
అశోక్ కుమార్ పోస్ట్ చేసిన వీడియో చూసి హీరోగారు హర్టయ్యారట. ఆయన పబ్లిక్‌లో అసహ్యకరంగా బూతుల పాట పాడితే లేదు కానీ, అదేంటని ప్రశ్నించడం తప్పంట. పాడింది ఏదో భగవద్గీత అయినట్లుగా మళ్లీ బెదిరింపులు, 24 గంటల్లో ఆయనకు క్షమాపణ చెప్పాలట! ఆయన పబ్లిగ్గా స్టేజ్‌పై పాడిన పాటకు క్షమాపణ చెప్పడట.. కానీ, ఇలాంటి చెత్త పనులేంటి అన్న వ్యక్తి మాత్రం క్షమాపణ చెప్పాలని బెదిరిస్తున్నాడంటే, ఏం చూసుకుని ఇదంతా? కొత్తగా ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వస్తున్నారు. ఎవరూ, ఇంత యాటిట్యూడ్ చూపించడం లేదు. దాంతోనే ఇండస్ట్రీలో నెట్టుకు రావాలని అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది.
క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఒక హీరో ఎదిగే క్రమంలో మీడియా సపోర్ట్ ఎంతో అవసరం. మెగాస్టార్ చిరంజీవి వంటివారే ఆ విషయాన్ని పదే పదే చెబుతుంటారు. అలాంటిది, నిన్నకాక మొన్న వచ్చిన ఈయనగారు చేసేందే పెద్ద మిస్టేక్.. మళ్లీ రుబాబు. మరి ఎవ్వరూ చెప్పడం లేదో, లేదంటే చెప్పినా వినడం లేదో. ఆయన పాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న జెడి చక్రవర్తి (JD Chakravarthy) తన మిస్టేక్ తెలుసుకుని, ఆయన ఇవ్వాల్సిన వివరణ ఆయన ఇచ్చారు. ఆ సమయంలో లేచి వెళ్లిపోతే సినిమా భవిష్యత్ నాశనం అవుతుందని, తద్వారా ఎంతో మంది ఇబ్బంది పడతారని కూర్చున్నానని, వ్యక్తిగతంగా తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని, ఇలా బూతులు మాట్లాడిన వారిని గతంలో కొట్టినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సినిమాపై క్రేజ్ కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని ఆయన కూడా అన్నారు. మరి సదరు హీరో యాటిట్యూడ్‌లో ఎప్పుడు మార్పు వస్తుందో..
మొత్తానికి చంద్రహాస్ బూతు పాట వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.


