
ఒకప్పుడు కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం. పిల్లలు, పెద్దలు అంతా కలిసిపోయి అన్యోన్యంగా జీవించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. సాంకేతిక ఆధారిత జీవనశైలి, సమయ భావం కారణంగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై పోయింది. దీంతో కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అనే పరిస్థితి వచ్చింది. చివరకు కన్నతల్లిదండ్రులను కూడా చూసుకోవడం భారంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ గా మారింది. అత్తమామలకు వంట చేసి భోజనం పెట్టడం లేదనే కారణంతో ఒక తల్లి తన సొంత కూతుర్ని చితకబాదింది. సాధారణంగా అత్తమామల వేధింపుల గురించి వింటుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఓ తల్లి తన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. అక్కడ సదరు యువతి తన అత్తమామలకు సరిగా భోజనం పెట్టడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి వెంటనే కూతురి ఇంటికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన తల్లి క్రికెట్ బ్యాట్ తో తన కూతుర్ని చితకబాదింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. అత్తమామలకు వండిపెట్టని కోడలికి తల్లి చెప్పిన గుణపాఠం అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ఒక తల్లి తన బిడ్డ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటని ఏదైనా ఉంటే సర్ది చెప్పాలి కాని ఇలా దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


