
📌 Key Points
- AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కు 3 వేలకు పైగా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయి.
- ఫైనల్స్‌లో గెలిచిన వారికి 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభిస్తుంది.
- ఫిబ్రవరి 19 నుంచి టాప్ 100 షార్ట్ ఫిల్మ్స్ AVAA ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రదర్శించబడతాయి.
- శివ బాలాజీ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తారు, గ్రాండ్ ఫినాలే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతుంది.
మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కు భారీ స్పందన లభించింది. ఈ కాంటెస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3000లకు పైగా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయి. గెలుపొందిన వారికి 10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశం లభిస్తుంది.
AVAA షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కు అనూహ్య స్పందన
AVAA Entertainment: సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ‘మా’ అధ్యక్షుడు మంచి విష్ణు తన నిర్మాణ సంస్థ అయినటువంటి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ (AVAA Entertainment) ఆధ్వర్యంలో ‘AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాంటెస్ట్‌కు హీరో, నిర్మాత అయిన విష్ణు మంచు (Manchu Vishnu)నే నాయకత్వం వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చినట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ‘రోడ్ టు AVAA ఎంటర్‌టైన్‌మెంట్’ అనే పేరుతో మొదలైన ఈ ప్రయాణానికి వచ్చిన స్పందనకు మంచు విష్ణు అండ్ టీమ్ ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11,000కు పైగా ఎంక్వైరీస్ రాగా, అందులో 3,000కు మించిన షార్ట్ ఫిల్మ్స్ ఎంట్రీలు వచ్చినట్లుగా టీమ్ ప్రకటించింది. ఈ క్రమంలో ఈ కాంటెస్ట్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. అవేంటంటే..
టాప్ 100 షార్ట్ ఫిల్మ్స్ స్ట్రీమింగ్ ఎక్కడ?
మొత్తం వచ్చిన 3000 షార్ట్స్ ఫిల్మ్స్ అప్లికేషన్స్ నుంచి టాప్ 100 షార్ట్ ఫిలిమ్స్‌ను ఎంపిక చేశారట. ఈ చిత్రాలను ఫిబ్రవరి 19 నుంచి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారని, ఈ షోకు టాలీవుడ్ నటుడు శివ బాలాజీ (Siva Balaji) హోస్ట్‌గా వ్యవహరించనున్నారని అధికారికంగా తెలుపుతూ ఓ వీడియోను మంచు విష్ణు విడుదల చేశారు. ఇక ఈ 100 చిత్రాల్లో నుంచి టాప్ 15 చిత్రాలను సెలెక్ట్ చేసి.. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నారట. ఈ ఫినాలేను తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో గ్రాండ్‌గా జరపనున్నామని, ఉత్కంఠభరితమైన ఛాలెంజ్‌లతో ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌గా ఈ ఫినాలేను నిర్వహిస్తామని మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఈ సెలబ్రేషన్‌తో అయిపోలేదు. అసలైన మ్యాటర్ మొదలయ్యేది ఇక్కడి నుంచే.. అవును, ఈ కాంటెస్ట్ పెట్టడానికి కారణం ఏమిటో.. ముందే మంచు విష్ణు వివరంగా తెలిపారు. అది ఈ సెలబ్రేషన్స్ నుంచే మొదలవుతుంది.
గ్రాండ్ ఫినాలే ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
సెలబ్రేషన్ ప్రక్రియ అనంతరం మార్చి 19న ఈ కాంటెస్ట్ ఫైనల్ విజేతను ప్రకటించనున్నారట. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూ. 10 కోట్ల బడ్జెట్‌తో ఫీచర్ ఫిల్మ్ దర్శకత్వం చేసే అరుదైన అవకాశాన్ని మంచు విష్ణు కల్పిస్తానని మాటిచ్చారు. ముందుగా మాట ఇచ్చినట్లుగా.. ఈ ప్రయాణంలో విజేతగా నిలిచిన వారితో తన బ్యానర్‌లో సినిమా చేసేందుకు మంచు విష్ణు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మరి ఇంతటితో ఈ జర్నీ ఆగుతుంతో లేదంటే సర్కిల్‌లా మళ్లీ కాంటెస్ట్ సీజన్ 2 మొదలవుతుందో తెలియాలంటే మాత్రం.. మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే. సినీ ప్రపంచంలో కొత్త ప్రతిభను వెలికి తీసే ఈ ప్రయాణం.. ఎంతో మంది నూతన నటీనటులకు, దర్శకులకు అవకాశం ఇస్తుందని అంతా భావిస్తున్నారు.
చివరిగా, ఈ కాంటెస్ట్ గెలుపొందిన దర్శకుడికి ఒక గొప్ప అవకాశం. ఇటువంటి కాంటెస్ట్‌లు కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. దీని ద్వారా మంచి దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతారు.

